కరోనా భయమా..? వివరాల కోసం ఈ నంబర్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది.!
కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనపడని వైరస్ పై యుద్ధం ప్రకటించాయి. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదుగురు కరోనా ప్రభావంతో మరణించగా.. రెండు వందల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేదిశగా కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా హెల్స్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఇకపై సోషల్ మీడియా యాప్.. వాట్సాప్‌లో […]
కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనపడని వైరస్ పై యుద్ధం ప్రకటించాయి. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదుగురు కరోనా ప్రభావంతో మరణించగా.. రెండు వందల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు.
ఈ క్రమంలో ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేదిశగా కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా హెల్స్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఇకపై సోషల్ మీడియా యాప్.. వాట్సాప్‌లో ఈ కరోనా వైరస్ వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఓ వాట్సాప్ చాట్‌బోట్‌ను రెడీ చేసింది. కరోనా వైరస్ గురించి కావలసిన సమాచారాన్ని ఈ బోట్ ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, క్వారంటైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. ఇలా అన్నీ ఈ బోట్ ద్వారా తెలుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ బోట్ పేరు ‘మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్’.
మీరు కూడా వాట్సాప్ ద్వారా కరోనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. 90131 51515 నంబరును మొబైల్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుందట.
Prepare, Don’t Panic: Government launches MyGov Corona Helpdesk on WhatsApp for alerting citizens & disseminating information.
Citizens can now send ‘Hi’ on WhatsApp to +91 9013151515 and get automated responses to queries related to Coronavirus. #IndiaFightsCorona pic.twitter.com/6gZZvDVM0g
— Piyush Goyal (@PiyushGoyal) March 20, 2020