క్రైమ్: శివాలయంలో ఇద్దరి సాధువుల దారుణ హత్య
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు సంచలనంగా మారాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్‌లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం ఉదయం యూపీలో దారుణం..

దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు శివాలయంలో సాధువుల హత్యలు సంచలనంగా మారాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్‌లో జరిగింది. మొన్న పాల్ ఘర్ ఘటన మరువకముందే.. మంగళవారం ఉదయం యూపీలో దారుణం చోటుచేసుకుంది. బులంధర్ షాలోని ఓ ఆలయంలో ఇద్దరు సాధువులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధువుల మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా సాధువుల హత్యతో గ్రామస్థులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. అదనపు బలగాలతో పరిస్థితిని అదుపు చేస్తున్నారు పోలీసులు.
Read More:
మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!
లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ