Corona: మహేష్‌బాబు డైలాగ్ వాడుకున్న హైదరాబాద్ పోలీసులు.. వాడితే వాడారు కానీ.. మంచి సందేశం ఇచ్చారు..
Corona Awareness: సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రజల్లో ట్రాఫిక్‌పై, సైబర్ నేరాలపై అవగాహన...
Corona Awareness: సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ప్రజల్లో ట్రాఫిక్‌పై, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర పోస్టులు చేస్తుంటారు. ఇందుకోసం సినిమా డైలాగ్‌లను హీరోలను ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మానవాళిని భయపెట్టిస్తోన్న కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో మహేష్ బాబు సినిమా డైలాగ్‌ను వాడుకున్నారు.
హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్..
#MaskIsMust@urstrulyMahesh pic.twitter.com/L4AzI0JBvO
— Telangana State Police (@TelanganaCOPs) April 24, 2021
వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలంటే మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం మాస్కు ధరించడం.. ఇందులో భాగంగానే మాస్కు వాడకం అవసరాన్ని వివరిస్తూ… మహేష్ బాబు హీరోగా నటించిన బిజినెస్ మ్యాన్ సినిమలోని… ‘జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్… మాస్కు ధరించండి అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు.
ప్లాస్మాదానం గురించి మహేష్ చేసిన ట్వీట్..
Let’s do everything in our stride to help those battling with Covid. Plasma donors are needed more than ever now. I pledge my support to @cpcybd VC Sajjanar sir & @cyberabadpolice for taking up this initiative. #DonatePlasmaSaveLives https://t.co/AiMipnd7Ey
— Mahesh Babu (@urstrulyMahesh) April 23, 2021
ఇదిలా ఉంటే కరోనా బారిన పడిన వారిని రక్షిచడంలో ప్లాస్మా దానం ఎంతటి ముఖ్యపాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయమై గతంలో పోలీస్ అధికారి సజ్జనర్ ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. తాజాగా ఆ వీడియోను షేర్ చేసిన మహేష్ బాబు.. ‘కరోనాతో పోరాడుతున్న వారికోసం మనకు సాధ్యమైనంత చేయూతనిద్దాం. గతంలో కంటే ఇప్పుడు ప్లాస్మా దాతలు మరింత అవసరం. పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు, సైబరాబాద్ పోలీసులు తీసుకున్న చొరవకు నా మద్దతు తెలియజేస్తున్నా’ అంటూ క్యాప్షన్ జోడిచారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: Oxygen Plant: గుజరాత్‌లో కొత్తగా 11 ఆక్సిజన్ ప్లాంట్‌లు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా
Bank Account:సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!