దగ్గినందుకు స్నేహితుడ్ని కాల్చేసిన యువకుడు..
కరోనా కల్లోల్లం రేపుతోంది. ఒకప్పుడు తుమ్మితే సత్యం..అనే జనాలు..ఇప్పుడు తుమ్మినా,దగ్గినా చచ్చంరో అంటున్నారు. మరికొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు.
కరోనా కల్లోల్లం రేపుతోంది. ఒకప్పుడు తుమ్మితే సత్యం..అనే జనాలు..ఇప్పుడు తుమ్మినా,దగ్గినా చచ్చంరో అంటున్నారు. మరికొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. యూపీలో ఇటువంటిదే అమానుష సంఘటన చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జార్చా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొందరు యువకులు సరదాగా ల్యూడో గేమ్ ఆడుతున్నారు. ఆట ఆడుతుండగా మధ్యలో ఓ యువకుడు దగ్గడంతో.. ఆగ్రహించిన మరో యువకుడు అతన్ని తుపాకీతో కాల్చేశాడు. గాయపడిన ప్రశాంత్‌సింగ్ అనే వ్యక్తిని హుటాహుటినా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.