రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది భారతీయ రైల్వే సంస్థ. ఇకపై పలు ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. జూన్ 1 నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ లేదా రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లో టికెట్లు తీసుకుని మాత్రమే...

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 29, 2020 | 1:23 PM

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది భారతీయ రైల్వే సంస్థ. ఇకపై పలు ప్రత్యేక రైళ్లకు తత్కాల్ బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. జూన్ 1 నుంచి భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ లేదా రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లో టికెట్లు తీసుకుని మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉండేది. వీటికి తత్కాల్ సదుపాయం ఉండేది కాదు. అయితే జూన్ 29 నుంచి అంటే ఈ రోజు నుండి తత్కాల్‌ సర్వీసును ప్రారంభించింది ఇండియన్ రైల్వే సంస్థ. దీంతో ఇకపై ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. దాదాపు 200 ప్రత్యేక రైళ్లతో పాటు రాజధాని రైళ్లలో కూడా తత్కాల్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. మరుసటి రోజు ప్రయాణించాలనుకునే వారు ముందు రోజు తత్కాల్‌ బుకింగ్ చేసుకోవచ్చు.

కాగా ఏసీ రైళ్లకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ రైళ్లకు ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ పీరియడ్‌ను 30 రోజుల నుంచి 120 రోజుల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆగస్ట్ 12 వరకు రెగ్యులర్ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్