స్పెయిన్‌లోనే కరోనా తొలి కేసు..?
యావత్ మానవజాతిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలోని వుహాన్ నగరం. ఇది ప్రపంచవ్యాప్తంగా జనమెరిగిన సత్యం. అయితే తాజాగా బార్సిలోనా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు.
యావత్ మానవజాతిని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలోని వుహాన్ నగరం. ఇది ప్రపంచవ్యాప్తంగా జనమెరిగిన సత్యం. అయితే తాజాగా బార్సిలోనా వర్సిటీ శాస్త్రవేత్తలు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు. ఆ వైరస్ మహమ్మారిని మొట్టమొదటిగా గుర్తించింది స్పెయిన్‌లో అని అంటున్నారు. ఇటీవల చేసిన ఓ పరిశోధనలో తమకు ఈ విషయం తెలిసిందన్నారు.
గతేడాది మార్చి 12న సేకరించిన బార్సిలోనాలోని వ్యర్థజలాల నమూనాలతో వ్యాధికి కారణమైన వైరస్ ఉనికిని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. ఇక చైనా డిసెంబర్ 2019లో డబ్ల్యూహెచ్ఓకు కరోనా వైరస్ గురించి వివరాలను తెలిపిన సంగతి విదితమే. ఆ తర్వాత ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాప్తి చెంది ఎంతోమంది ప్రాణాలను హరించింది.
ఇదిలా ఉంటే స్పెయిన్ పరిశోధకులు.. ఆ దేశంలోని వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాలను 2018 జనవరి- 2019 డిసెంబర్ మధ్య వేర్వేరు తేదీల్లో సేకరించగా.. వీటిల్లో కరోనా వైరస్‌కు సంబంధించిన జన్యువులను గుర్తించారు. ఆ సాంపిల్స్‌ను 2019 మార్చి 12న సేకరించగా.. దీనిపై సమీక్ష ఇంకా జరగాల్సి ఉందని చెబుతున్నారు. మరిన్ని నమూనాలను సేకరించి పరిశోధనలు విస్తృతంగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది చదవండి: ఇంట్లోనే స్వీయ నిర్బంధం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఉంటేనే సేఫ్..