77 మంది మత ప్రచారకుల గుర్తింపు..

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఇది మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ ఎంటర్ అయ్యింది. తొలుత ముగ్గురు నలుగురు ఉన్న ఈ కరోనా పాజిటివ్ బాధితులు తాజాగా ఇరవై మందికి పైగా చేరింది. అయితే వీరిలో ఇండోనేషియాకు చెందిన పలువురు మత ప్రభోదకులు ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు చేరుకోవడంతో.. జిల్లా ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. […]

77 మంది మత ప్రచారకుల గుర్తింపు..
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 8:38 PM

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఇది మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ ఎంటర్ అయ్యింది. తొలుత ముగ్గురు నలుగురు ఉన్న ఈ కరోనా పాజిటివ్ బాధితులు తాజాగా ఇరవై మందికి పైగా చేరింది. అయితే వీరిలో ఇండోనేషియాకు చెందిన పలువురు మత ప్రభోదకులు ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు చేరుకోవడంతో.. జిల్లా ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. వీరు దాదాపు 1500 కిలో మీటర్లు దేశంలో తిరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వీరంతా రైలు మార్గంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. వీరిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అయితే విదేశాల నుంచి మొత్తం ఎంతమంది మత ప్రభోదకులు వచ్చారన్న దానిపై పోలీసులు లెక్కతీస్తున్నారు. ఇప్పటికీ మొత్తం 77 మందిని గుర్తించారు.

వీరిలో ఇండోనేసియా నుంచి 13 మంది రాగా.. కజికిస్థాన్ నుంచి 19, థాయిలాండ్ నుంచి 8, మలేసియా నుంచి 13, ఇరాన్ నుంచి 14, సుడాన్ నుంచి 10 మంది మనదేశానికి వచ్చినట్లు గుర్తించారు. వీరు దేశంలోనే కాకుండా.. మన రాష్ట్రంలో కూడా పలు చోట్ల సంచరించినట్లు తెలుస్తోంది. అయితే నగరానికి వచ్చిన 64 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.