కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచనల నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లల్లో రిటర్ అయిన డాక్టర్లను, నర్సులను విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్దతిన డాక్టర్లను, నర్సులను..

కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 8:43 PM

కరోనా ఎఫెక్ట్‌‌తో.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచనల నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అనేక చర్యలను తీసుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లల్లో రిటర్ అయిన డాక్టర్లను, నర్సులను విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్దతిన డాక్టర్లను, నర్సులను తీసుకోనున్నట్లు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అయితే.. వైద్యం అందించేందుకు డాక్టర్ల, నర్సులను కొరత రాకుండా ఉండేందుకు ముందుగానే తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయి. ఇండియా వ్యాప్తంగా 283 కేసులు నమోదవ్వగా 23 మంది రికవరీ అయ్యారు. ఐదుగురు మరణించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్, ఆఫీసులు, టెంపుల్స్‌ని సైతం మూసివేసింది ప్రభుత్వం.

Read More this also: కరోనా ఎఫెక్ట్: పోయిన గతం మళ్లీ గుర్తొచ్చింది

బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..