పార్లమెంటులో కరోనాపై యుద్ధం…భవనాలు, పరిసరాల్లో విస్తృతంగా పారిశుద్ధ్యం

కరోనా భయంతో ఆందోళన చెందుతున్న పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి భరోసా కల్పించడం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు చేపట్టారు. కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి పార్లమెంట్ ప్రాంగణంలోని అన్ని భవనాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, క్రిమిసంహారక ద్రావణాలతో శానిటైజ్ చేయాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) పారిశుద్ధ్య సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనిలో పడ్డారు. భవనాలను ముందు హైప్రెజర్ వాటర్ పంప్‌ […]

పార్లమెంటులో కరోనాపై యుద్ధం...భవనాలు, పరిసరాల్లో విస్తృతంగా పారిశుద్ధ్యం
Follow us

|

Updated on: Mar 21, 2020 | 8:10 PM

కరోనా భయంతో ఆందోళన చెందుతున్న పార్లమెంట్ సభ్యులు, సిబ్బందికి భరోసా కల్పించడం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా చర్యలు చేపట్టారు. కీలక అధికారులతో సమీక్ష నిర్వహించి పార్లమెంట్ ప్రాంగణంలోని అన్ని భవనాలు, పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని, క్రిమిసంహారక ద్రావణాలతో శానిటైజ్ చేయాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో శనివారం రంగంలోకి దిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) పారిశుద్ధ్య సిబ్బంది పార్లమెంట్ ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేసే పనిలో పడ్డారు. భవనాలను ముందు హైప్రెజర్ వాటర్ పంప్‌ ఉపయోగించి శుభ్రం చేశారు. అనంతరం క్రిమిసంహారక ద్రావణాలను స్ప్రే చేయడంతో పాటు బ్యాక్టీరియా, వైరస్ నిరోధక రసాయనాలతో సభ్యులు కూర్చునే సీట్లు, ఉపయోగించే మైకులను శుభ్రం చేశారు. ఆదివారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాన భవనంతో పాటు పార్లమెంట్ లైబ్రరీ భవనం, పార్లమెంట్ అనెక్స్ భవనం, రిసెప్షన్, సెక్యూరిటీ విభాగం, సెంట్రల్ పాస్ ఇష్యూయింగ్ సెంటర్ వంటి మరికొన్ని భవనాలు ఉన్నాయి. అన్నింటిలోనూ ఈ చర్యలు చేపట్టాల్సిందిగా స్పీకర్ ఓంబిర్లా స్పష్టమైనా ఆదేశాలిచ్చారు. అందుకే ఆరోగ్యశాఖ సిబ్బంది పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్మికులు ఈ పనులను కొనసాగిస్తున్నారు.

కనిక తెచ్చిన తంటా!

నిజానికి ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక కారణం బాలీవుడ్ గాయని కనికా కపూర్. యూకే నుంచి ఈ మధ్యనే తిరిగి వచ్చిన ఆమె యూపీ రాజధాని లఖ్‌నవూలో ఓ స్టార్ హోటళ్లో ఏర్పాటు చేసిన వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత కరోనా లక్షణాలు వెలుగుచూడడంతో శుక్రవారం వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా సోకిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో వెంటనే ఆమె ఎవరెవరిని కలిశారో తెలుసుకునే ప్రయత్నాలు చేయగా, వేడుకకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ సహా పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల ప్రముఖులు, సీనియర్ బ్యూరోక్రాట్లు హాజరైనట్టు గుర్తించారు. అయితే పార్లమెంట్ సభ్యుడైన దుష్యంత్ సింగ్ అప్పటికే వరుసగా రెండు రోజులు పార్లమెంట్ సమావేశాలకు, స్టాండింగ్ కమిటీ మీటింగులకు హాజరైనట్టు గుర్తించారు. ఈ క్రమంలో దుష్యంత్ సింగ్ కూర్చునే వరుసలో ఆయన పక్కన, ముందు, వెనుక వరుసల్లో కూర్చునే పార్లమెంట్ సభ్యులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలోనూ దుష్యంత్ సింగ్ హాజరైనందున, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సైతం కరోనా పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కనికా కపూర్‌తో పాటు పార్టీకి హాజరైన దుష్యంత్ సింగ్, వసుంధరా రాజేలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా లేదని తేలింది. అయినా సరే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిద్దరూ మరికొన్నాళ్లపాటు స్వీయ నిర్బంధం కొనసాగిస్తామని తెలిపారు. దుష్యంత్ వ్యవహారంతో పార్లమెంట్‌లో ఇతర ఎంపీలు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ ఓంబిర్లా పార్లమెంటును పూర్తిగా శుభ్రం చేసేందుకు ఆదేశించారు.

మహాత్మా కొడియార్, టీవీ 9 ప్రతినిధి

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు