కరోనా ఎఫెక్ట్: పోయిన గతం మళ్లీ గుర్తొచ్చింది

కరోనా ధాటికి ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 11 వేలకి పైగా ప్రజలు మరణించారు. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఓ వ్యక్తికి మాత్రం మర్చిపోయిన గతం..

కరోనా ఎఫెక్ట్: పోయిన గతం మళ్లీ గుర్తొచ్చింది
Follow us

| Edited By:

Updated on: Mar 21, 2020 | 7:58 PM

కరోనా ధాటికి ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా తయారైంది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 11 వేలకి పైగా ప్రజలు మరణించారు. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ ఓ వ్యక్తికి మాత్రం మర్చిపోయిన గతం తిరిగొచ్చింది. మూడు దశాబ్దాల తర్వాత తన ఇంటి వాళ్లను కలుసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గియిజు ప్రావిన్స్‌కు చెందిన 57 ఏళ్ల జు జియామింగ్ ఓ కార్మికుడు. 1990లో అతను ఉపాధి కోసం మరో ప్రాంతానికి వలసవెళ్లాడు. అయితే పనిచేస్తుండగా ఓ ప్రమాదంలో గాయపడి తన జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అయితే అతని వద్ద కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఐడెంటీ లేకపోవడంతో.. వివరాలను గుర్తించలేకపోయారు అధికారులు. అటు స్వగ్రామంలో అతని తల్లి మిస్సింగ్ కేసు పెట్టింది. జియామింగ్ ఆచూకీ లేకపోవడంతో కేసు కూడా కొట్టి వేశారు.. అక్కడి పోలీసులు.

అయితే.. జియామింగ్‌ను ఓ జంట చేరదీసి ఆదరించారు. జియామింగ్ తన స్వగ్రామం గురించి, కుటుంబ సభ్యుల గురించి ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఒక్క విషయం కూడా గుర్తుకు రాలేదు. అయితే ఇటీవల కరోనాకు సంబంధించిన వార్తల్లో అతడి స్వగ్రామం పేరు వినిపించింది. చిషు గ్రామంలో కూడా కరోనా మరణం సంభవించిందన్న వార్త వినడంతో జియామింగ్‌లో జ్ఞాపకాలు పురివిప్పాయి. తన సొంత ఊరే కాకుండా అయినవాళ్లందరూ కళ్లముందు మెదిలారు. వెంటనే పోలీసులను కలిసి తన పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన పోలీసులు.. తల్లితో వీడియోకాలింగ్ మాట్లాడించి.. కుటుంబసభ్యుల చెంతకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More this also: బిఎస్‌ఎన్‌ఎల్ క్రేజీ ఆఫర్.. రోజుకి 5జీవీ ఫ్రీ..ఫ్రీ..

జబర్దస్త్‌ షోలో క్లాషెస్.. స్టేజ్ దిగి వెళ్లిపోయిన టీం లీడర్..

కరోనాలో కనిపించే మరో రెండు కొత్త లక్షణాలు.. ఇవి ఉన్నవారు కోలుకోవడం కష్టమే

నిర్భయ దోషుల్ని ఉరితీసే తలారికి ఎంత డబ్బు ఇస్తారంటే..

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..