“నెగిటివ్ థింకింగ్ వద్దు..అలా ఉంటే ఆముదం తాగండి”

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నిర్ణయానికి పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కాస్త లేటుగా రిప్లై ఇచ్చినా, ఘాటైన ఇంపాక్ట్ ఇచ్చారు. కరోనా వైరస్ చైన్‌ని తెంపాలనే ఉద్దేశ్యంతో పెద్దలు […]

నెగిటివ్ థింకింగ్ వద్దు..అలా ఉంటే ఆముదం తాగండి
Ram Naramaneni

|

Mar 21, 2020 | 9:25 PM

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నిర్ణయానికి పలువురు సెలబ్రిటీలు మద్దతు తెలుపుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్‌లో చేరిపోయారు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. కాస్త లేటుగా రిప్లై ఇచ్చినా, ఘాటైన ఇంపాక్ట్ ఇచ్చారు. కరోనా వైరస్ చైన్‌ని తెంపాలనే ఉద్దేశ్యంతో పెద్దలు తీసుకున్న నిర్ణయంలో అందరూ భాగం కావాలని సూచించారు. ప్రస్తుతం కరోనా లేని సిటీ వుహాన్ మాత్రమే అని..అక్కడ అందరూ ఒక్కటై కరోనాను నిరోధించారని పేర్కొన్నారు. మనం కూడా అదే ఐఖ్యత చూపించాలని తెలిపారు. కొంతమంది దీనిపై నెగిటీవ్ థింకింగ్ చేస్తున్నారని, అవన్నీ పక్కనపెట్టి ప్రధాని చెప్పిన మాట వినాలని కోరారు. మరీ అంత ప్రస్టేషన్ ఉంటే పొద్దున్నే లేవగానే నాలుగు స్పూన్ల ఆముదం తాగితే మోషన్స్ అవుతాయని ఆ పనిలో ఉంటే రోజు గడిచిపోతుంది అంటూ తన మార్క్ పంచ్ డైలాగ్ పేల్చారు పూరి. దీంతో ఏ విషయంలో అయినా ని ఇంపాక్ట్ వేరే లెవల్ పూరి అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu