జనతా కర్ఫ్యూ: చైనాలా కట్టడి చేద్దామా..? ఇటలీలా చేతులెత్తేద్దామా..?

కరోనా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఈ భూతం వణికిస్తోంది. రోజురోజుకు మృత్యునాదం చేస్తూ తన పరిధిని విస్తరిస్తోంది. భారత్‌లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది నీకు, నాకు మాత్రమే కాదు. భావి తరాలకు, ఈ దేశానికి, భవిష్యత్ తరాలకు కూడా […]

Follow us

|

Updated on: Mar 21, 2020 | 10:22 PM

కరోనా ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఈ భూతం వణికిస్తోంది. రోజురోజుకు మృత్యునాదం చేస్తూ తన పరిధిని విస్తరిస్తోంది. భారత్‌లో కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు  దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది నీకు, నాకు మాత్రమే కాదు. భావి తరాలకు, ఈ దేశానికి, భవిష్యత్ తరాలకు కూడా ఎంతో ముఖ్యం. లైట్ తీసుకుంటే ఎంతోమంది చావులకు కారకులుగా మిగిలిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చైన్‌ని తెగొట్టాలనే ఉద్దేశ్యంతో పెద్దలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం.
అసలు కరోనా పుట్టింది వుహాన్ సిటీలో. కానీ అక్కడ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలు గొప్పవనే చెప్పాలి. గత రెండు రోజులుగా అక్కడ ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు. దానికి వారు బయట కనిపిస్తే కాల్చివేత లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో వ్యాధి తొందరగా వ్యాపించినప్పటికి..వారు చర్యలు తీసుకుని మహమ్మారిని కట్టడి చేయగలిగారు. కానీ ఇటలీ పరిస్థితి వేరు. అక్కడ ఇప్పుడు కరోనా మృత్యునాదం చేస్తోంది. రోజుకు 100 సంఖ్యలో ప్రాణాలను తీస్తోంది. దీనికి అక్కడ ఉన్న సోషల్ లైఫ్‌తో పాటు వ్యాధి ప్రారంభదశలో అక్కడ ప్రభుత్వం అవలంభించిన నిర్లక్ష్య వైఖరి కూడా కారణమనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యలంలో మన దేశాన్ని మనం కాపాడుకునే సమయం వచ్చింది. ఎవ్వరూ తుపాకులు పట్టుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గస్తీ కాయాల్సిన పనిలేదు. ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటలకు వరకు బయటకు రాకుండా ఉంటే చాలు. కుదిరితే సమయాన్ని మరింత పెంచండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మన దేశాన్ని కూడా కాపాడండి. ఎందుకంటే మనది ప్రజాస్వాయ్య దేశం. చైనాలా నియంతృత్వ, ఏకీకృత నిర్ణయాలు తీసుకోలేం. సో స్టే హోమ్..స్టే హెల్తీ.