AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: సినిమా ఇండస్ట్రీని వదలనంటోన్న కరోనా.. మహమ్మారి బారిన బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ.. వాటిని నమ్మోద్దంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌..

సినిమా పరిశ్రమలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కాగా మహమ్మారి ప్రభావం హిందీ చిత్ర పరిశ్రమపై అధికంగా ఉంది.

Coronavirus: సినిమా ఇండస్ట్రీని వదలనంటోన్న కరోనా.. మహమ్మారి బారిన బాలీవుడ్ బుల్లితెర బ్యూటీ.. వాటిని నమ్మోద్దంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌..
Erica Fernandes
Basha Shek
|

Updated on: Jan 05, 2022 | 6:06 PM

Share

సినిమా పరిశ్రమలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కాగా మహమ్మారి ప్రభావం హిందీ చిత్ర పరిశ్రమపై అధికంగా ఉంది. ఇప్పటికే కరీనా కపూర్‌, నోరా ఫతేహీ, ఏక్తా కపూర్‌, సోనూ నిగమ్‌, అర్జున్‌ కపూర్‌, రియా కపూర్‌, జాన్ అబ్రహం- ప్రియా రుంచల్‌, మృణాళ్‌ ఠాకూర్‌ తదితర ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బుల్లితెర హీరోయిన్‌, సోషల్ మీడియా స్టార్‌ ఎరికా ఫెర్నాండెజ్‌ కరోనా బాధితుల జాబితాలో చేరిపోయింది. ఆమెతో పాటు తన తల్లికి కూడా కొవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది ఫెర్నాండెజ్‌.

వాటితో మూడు సార్లు నెగెటివ్‌.. ఇప్పుడు మాత్రం.. కాగా తన అందం, అభినయంతోబాలీవుడ్‌ బుల్లితెరపై రాణిలా వెలుగొందుతోంది ఎరికా ఫెర్నాండెజ్‌. అన్నట్లు ఈ అమ్మడు తెలుగులో కూడా నటించింది. ఆది సాయికుమార్‌ హీరోగా వచ్చిన ‘గాలిపటం’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కాగా ముందు స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవి సెల్ఫ్‌ హోమ్‌ కిట్స్‌తో స్వయంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకుందీ అందాల తార. అందులో ఒకటి..రెండు కాదు ఏకంగా మూడుసార్లు నెగెటివ్‌ వచ్చిందట. ‘ జనవరి 2న నాకు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. దీంతో కోవి సెల్ఫ్‌ కిట్‌ సహాయంతో నాకునేనే పరీక్షించుకున్నాను. మొత్తం మూడు సార్లు నెగెటివ్ అని వచ్చింది. నాతోపాటు మా అమ్మకు కూడా కూడా నెగెటివ్‌ అని తేలింది. కానీ నా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఎక్కువయ్యాయి. వీటితో పాటు శరీరంలో వణుకు మొదలైంది. జ్వరం కూడా ఇబ్బంది పెట్టింది. దీంతో కొవిడ్‌ ల్యాబ్‌ కెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాం. అందులో నాకు పాజిటివ్‌ అని తేలింది. అమ్మకు కూడా వైరస్‌ సోకిందని నిర్ధారణ అయింది’

వాటిని నమ్మోద్దు.. ‘నాకు కొవిడ్‌ వచ్చిందని తెలిసి మొదట కంగారు పడ్డాను. భయపడ్డాను. కానీ మనలో చాలా మందికి త‍్వరగా లేదా ఆలస్యంగా అయిన ఈ వైరస్‌ సంక్రమిస్తుందని తెలుసు. దురదృష్టవశాత్తు మా అమ్మకు కూడా పాజిటివ్‌ వచ్చింది. నా సలహా ఏంటంటే.. హోమ్‌ టెస్ట్‌ (కోవి సెల్ఫ్‌ కిట్‌)తో ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా పరీక్షలు చేసుకోకండి. అవి ఏ మాత్రం నమ్మదగినవి కావు’ అని తన అభిమానులకు సూచించింది ఫెర్నాండెజ్‌.

Also Read:

Viral news: బెడిసికొట్టిన ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. బురదలో పడిన వధూవరులు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..

Coronavirus: అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన పడిన ..