Viral news: బెడిసికొట్టిన ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. బురదలో పడిన వధూవరులు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

ఇటీవల పెళ్లిలో ఫొటోషూట్‌లు సర్వసాధారణమైపోయాయి. పెళ్లికి ముందే కాబోయే వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి వివిధ రకాల థీమ్స్‌, కాస్ట్యూమ్స్‌తో ఫొటో స్టిల్స్ తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు

Viral news: బెడిసికొట్టిన ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. బురదలో పడిన వధూవరులు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
Wedding Photoshoot
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2022 | 5:30 PM

ఇటీవల పెళ్లిలో ఫొటోషూట్‌లు సర్వసాధారణమైపోయాయి. పెళ్లికి ముందే కాబోయే వధూవరులు అందమైన లోకేషన్లకు వెళ్లి వివిధ రకాల థీమ్స్‌, కాస్ట్యూమ్స్‌తో ఫొటో స్టిల్స్ తీయించుకుంటున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. ఈక్రమంలో కజకిస్థాన్‌కు చెందిన ఓ జంట కూడా ఇలాగే ఆలోచించింది. అందమైన పెళ్లి దుస్తుల్లో ముస్తాబై ప్రి వెడ్డింగ్‌ షూట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. వధూవరులిద్దరూ ప్రమాదవశాత్తూ బురద గుంటలో పడిపోయారు. అయితే అక్కడ కూడా అదే నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కావాలనే చేశారా? వివరాల్లోకి వెళితే.. మురత్ జురాయేవ్, కమిల్లా అనే వధూవరులు ప్రి వెడ్డింగ్‌ షూట్‌ కోసం సమీపంలోని ఓ అవుట్‌డోర్‌ లొకేషన్‌కు వెళ్లారు. వరుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ సూట్‌లో రెడీ అవగా.. వధువు తెలుపు రంగు గౌన్‌లో పాలరాతి శిల్పంలా తయారైంది. ఇక ఫొటోషూట్లో భాగంగా కెమెరాకు పోజులిస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి బురద గుంటలో పడిపోయారీ న్యూ కపుల్‌. దీంతో వధువు తెలుపు రంగు గౌన్‌ అంతా బురదతో నిండిపోయింది. వరుడి దుస్తులు కూడా పాడయ్యాయి. దీంతో చేసేదేం నవ్వుతూ అక్కడి నుంచి తిరగొచ్చేశారు. కాగా బురదలో పడిన వధూవరులను సైతం ఎంతో అందంగా తన కెమెరాలో బంధించాడు వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌ . అనంతరం వీటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫొటోలను చూస్తుంటే వధూవరులు ప్రమాదవశాత్తూ బురదలో పడినట్లుగా కనిపించడం లేదు. కావాలనే బురదలో పడి ఫొటోలు తీసుకున్నారని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. బురదలో పడిన సమయంలో ఇద్దరి ముఖాల్లో హావాభావాలే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. కాగా గతంలో చాలామంది ‘మడ్డీ’ థీమ్‌తో ప్రి వెడ్డింగ్‌ ఫొటోషూట్లు జరుపుకొన్న సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by ????? ?????? (@bumagaz)

Also Read:

Coronavirus: అమితాబ్‌ ఇంట్లో మళ్లీ కరోనా టెన్షన్‌.. వైరస్‌ బారిన పడిన ..

Kartik Aaryan: కార్తిక్‌.. బయటకు రా.. బాలీవుడ్‌ హీరో ఇంటి ముందు అమ్మాయిల హల్‌చల్‌.. ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు..

Viral news: ఒకటి.. రెండు కాదు.. ఏకంగా 11 సార్లు కరోనా టీకా తీసుకున్న ఘనుడు.. ఆశ్చర్యపోయిన అధికారులు..