AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను పసిగట్టేందుకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ!

శునకాలు ఇప్పటికే పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నిషేధిత ఆహార పదార్థలతో పాటు మలేరియా, క్యాన్సర్‌ను పసిగడుతున్నందున.. కరోనాను కూడా గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక్కో వైరస్‌కు ప్రత్యేక వాసన ఉంటుందని..

కరోనాను పసిగట్టేందుకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 30, 2020 | 4:22 PM

Share

శునకాల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికా, బ్రిటన్‌లోని కుక్కలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తున్నారని.. వాటికి వైరస్ వాసనను కనిపెట్టగలిగే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్టు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారిన కరోనా వైరస్‌ని ఎలా కట్టడి చేయాలో తెలీక ప్రపంచ దేశాలు తర్జన భర్జన పడుతున్నాయి. కాగా ఇప్పటికే వ్యాక్సిన్ కోసం ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కుక్కల ద్వారా వాటిని కనిపెట్టవచ్చని నిపుణులు పేర్కొనడం ఆసక్తి కలిగించే విషయం.

అలాగే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించింది. మానవుల్లో ఉండే మలేరియా ఇన్ఫెక్షన్లను కుక్కలు పసిగట్టగలవని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారు. దీంతో ఇప్పుడు దీనిపై దృష్టి సారించారు నిపుణులు. ఒకవేళ కరోనాను గనుక శునకాలు పసిగట్టగలిగితే.. ఎయిర్ పోర్ట్స్, హాస్పిటల్స్, ఇతర వ్యాపార ప్రాంతాల్లోనూ స్క్రీనింగ్ చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

శునకాలు ఇప్పటికే పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నిషేధిత ఆహార పదార్థలతో పాటు మలేరియా, క్యాన్సర్‌ను పసిగడుతున్నందున.. కరోనాను కూడా గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక్కో వైరస్‌కు ప్రత్యేక వాసన ఉంటుందని వారు తెలిపారు. ఒక వేళ వీటిని ట్రైనింగ్ ఇచ్చి.. వైరస్‌ని కనిపెడితే.. ఒక్కో కుక్క గంటకు 250 మందిని స్క్రీనింగ్ చేయగలదని లండన్ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Read More: 

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు

ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
అతిగా తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
అతిగా తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత
న్యూయార్క్, న్యూజెర్సీలో మంచు తుఫాన్ తీవ్రత
వైకుంఠ ఏకాదశి: మీరు ఉపవాసం ఉంటున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి
వైకుంఠ ఏకాదశి: మీరు ఉపవాసం ఉంటున్నారా? ఐతే ఈ తప్పులు చేయకండి
వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు
వచ్చే రెండు రోజులూ వణుకే.. మరింత పడిపోనున్న ఉష్ణోగ్రతలు
ఉద్యోగం మానేస్తే పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ ఆగిపోతుందా..? కొత్త రూల్స్
ఉద్యోగం మానేస్తే పీఎఫ్ అకౌంట్‌లో వడ్డీ ఆగిపోతుందా..? కొత్త రూల్స్