తెరపైకి మరో కొత్త పేరు.. కిమ్ వారసుడు ఆయనేనట.!
నార్త్ కొరియా అధ్యక్షుడు, డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ బ్రతికి ఉన్నారా.. లేక చనిపోయారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొంతమంది అయితే ఆయన గుండె సర్జరీ చేయించుకున్నారని.. అది తిరగబెట్టిందని అంటున్నారు. మరికొందరైతే ఆయన బ్రెయిన్ డెడ్ అని.. ఇంకొందరు అయితే కరోనాకు భయపడి ఆయన రిసార్ట్‌లో సేద తీరుతున్నారని రాసుకొచ్చారు. ఇవన్నీ వట్టి రూమర్లేనని ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టిపారేస్తున్నా.. కిమ్ బయటికి రాకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇక ఆయన స్థానాన్ని […]

నార్త్ కొరియా అధ్యక్షుడు, డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ బ్రతికి ఉన్నారా.. లేక చనిపోయారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కొంతమంది అయితే ఆయన గుండె సర్జరీ చేయించుకున్నారని.. అది తిరగబెట్టిందని అంటున్నారు. మరికొందరైతే ఆయన బ్రెయిన్ డెడ్ అని.. ఇంకొందరు అయితే కరోనాకు భయపడి ఆయన రిసార్ట్‌లో సేద తీరుతున్నారని రాసుకొచ్చారు. ఇవన్నీ వట్టి రూమర్లేనని ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టిపారేస్తున్నా.. కిమ్ బయటికి రాకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇక ఆయన స్థానాన్ని సోదరి కిమ్ యో జోంగ్ చేపట్టబోతోందని వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిల్లో నిజం లేదు. ఆమెకు అధికార పదవి కట్టబెట్టలేదు గానీ.. కేబినేట్‌లో ఓ కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే ఊహించని విధంగా కిమ్ చిన్నాన్న కిమ్ ప్యాంగ్ (65) పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈయనే అధ్యక్ష పదవి రేసులో ముందు ఉన్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ వారసుల్లో ఒకడు ఈ ప్యాంగ్ ఇల్. దాదాపు 4 ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన పేరు.. కిమ్ అదృశ్యం కావడంతో తెరపైకి వచ్చింది. అధ్యక్షుడిగా ఆయన తగినవాడని అక్కడి మేధావులు అభిప్రయపడుతున్నారు. 1970లో అన్న కిమ్ జోంగ్ ఇల్ చేతిలో ఓడిపోయిన ప్యాంగ్ ఇల్ హంగేరి, బల్గేరియా, ఫిన్ లాండ్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో పలు దౌత్య పదవుల్లో పని చేశారు. ఇక ప్యాంగ్ అన్న కిమ్ జోంగ్ ఇల్ 1994 నుంచి 2011 వరకు ఉత్తరకొరియాను పాలించగా.. ఆయన మరణాంతరం కుమారుడు కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
Read Also: