రెండు రోజుల్లో ’ప్లాస్మా‘ బ్యాంకు ఏర్పాటు
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్లాస్మా థెరఫికి ఆశించిన ఫలితాలు రావటంతో చాలా రాష్ట్రాల్లో వైద్యులు ఇప్పుడు ప్లాస్మా థెరఫీకే మొగ్గుచూపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో
కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్లాస్మా థెరఫికి ఆశించిన ఫలితాలు రావటంతో చాలా రాష్ట్రాల్లో వైద్యులు ఇప్పుడు ప్లాస్మా థెరఫీకే మొగ్గుచూపుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ నెలలోనే తొలిసారి ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి.. వెంటిలేటర్‌పై ఉన్న ఓ 49ఏళ్ల వ్యక్తికి ప్లాస్మా చికిత్స చేశారు. తాజాగా ఆప్ సర్కార్ ప్లాస్మా థెరఫికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం స్పష్టం చేశారు.
మరో రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోవిడ్-19 రోగుల ప్రాణాలను కాపాడటానికి మహమ్మారి నుంచి కోలుకున్నవారు పెద్ద మనసుతో ముందుకు రావాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ ప్లాస్మా థెరపీ క్లినికల్ ట్రయల్స్ 29 మందిపై నిర్వహించామని, ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయని చెప్పారు. ఇప్పటికే వైరస్ బారినపడి కోలుకున్నవారు తమ ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు రావాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెస్ వద్ద ప్లాస్మా బ్యాంకును ఏర్పాటుచేస్తున్నట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్లాస్మా దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పిన సీఎం కేజ్రీవాల్..అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ ప్రభుత్వం సి్ధం చేస్తుందని తెలిపారు.