కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తొలి కరోనా వైరస్ మరణం సంభవించింది. గుట్ల వీధికి చెందిన 68 ఏళ్ల వ్యక్తికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాకినాడ మాదవపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి...

కరోనా రక్కసికి మరొకరు బలి.. పిఠాపురంలో తొలి కోవిడ్ మరణం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 29, 2020 | 2:57 PM

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో తొలి కరోనా వైరస్ మరణం సంభవించింది. గుట్ల వీధికి చెందిన 68 ఏళ్ల వ్యక్తికి ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాకినాడ మాదవపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి గుండె సంబంధిత వ్యాధితో చికిత్స నిమిత్తం వెళ్లగా.. ఆయనకి కరోనా లక్షణాలు కూడా ఉండటంతో డాక్టర్లు కోవిడ్ టెస్ట్ కూడా చేశారు. అనంతరం రిపోర్ట్స్‌లో కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో వైద్యులు వెంటనే ఆయన చికిత్స అందించారు. అయితే ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధి కూడా ఉండటంతో  చికిత్స పొందుతూ ఈ రోజు ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

కాగా అటు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 793 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 706 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 87 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇందులో 7,479 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,232 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 180కి చేరింది.

మరోవైపు గడిచిన 24 గంటల్లో 30,216 శాంపిల్స్ పరీక్షించగా.. అందులో 706 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఆదివారం 302 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. 11 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 96, చిత్తూరు 56, ఈస్ట్ గోదావరి 72, గుంటూరు 98, కడప 71, కృష్ణ 52, కర్నూలు  86, నెల్లూరు 24, ప్రకాశం 26, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 11, విజయనగరం 1, వెస్ట్ గోదావరిలో 113 కేసులు నమోదయ్యాయి.

Read More: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!