నాగాలాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్ ఇవే..

నాగాలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం నాడు కొత్తగా..

నాగాలాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజా అప్డేట్స్ ఇవే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 29, 2020 | 4:07 PM

నాగాలాండ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్‌లాక్‌ 1.0 ప్రారంభమైన తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం నాడు కొత్తగా మరో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 434కి చేరింది. నాగాలాండ్‌ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 270 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మరో 164 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారన్నారు. అయితే ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ… ఇక్కడ కరోనా మరణాలు లేకపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5.48 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం 3.21 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా 2.10 లక్షల యాక్టివ్ కేసుల ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.