విషాదం: కరోనాతో కుప్పకూలిన ఏఎస్ఐ

కోవిడ్-19 కోరల్లో చిక్కుకుని యావత్ ప్రపంచం విలవిలాడుతోంది. భారత్‌లోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశ ఐటీ రాజధాని లోనూ కరోనా కరాళనృత్యం చేస్తోంది. కోవిడ్ బారినపడి ఏఎస్ఐ మరణించిన ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

విషాదం: కరోనాతో కుప్పకూలిన ఏఎస్ఐ
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 29, 2020 | 4:19 PM

కోవిడ్-19 కోరల్లో చిక్కుకుని యావత్ ప్రపంచం విలవిలాడుతోంది. భారత్‌లోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మరింత వేగంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే దేశంలో 1.10 లక్షల పాజిటివ్ కేసులు నమోదైన తీరు వైరస్ ఉద్ధృతికి అద్దం పడుతోంది. గత నెల రోజుల నుంచి పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం మరో 19,700 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. దేశంలో మరో 384 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దేశ ఐటీ రాజధాని బెంగళూరులోనూ కరోనా కరాళనృత్యం చేస్తోంది. కోవిడ్ బారినపడి ఏఎస్ఐ మరణించిన ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ పోలీసుస్టేషనులో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న 57 ఏళ్ల వ్యక్తి జూన్ 10వతేదీ నుంచి ఇంటి నుంచే పనిచేస్తున్నారని, ఇంట్లో రాత్రివేళ బాత్ రూంకు వెళ్లి స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఏఎస్ఐ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారని డీసీపీ ఎంఎన్ అనుచేత్ వెల్లడించారు. ఏఎస్ఐ మృతదేహం నుంచి స్వాబ్ శాంపిల్ సేకరించి పరీక్షించగా అతనికి కరోనా ఉందని తేలినట్లు డీసీపీ చెప్పారు. దీంతో ఏఎస్ఐ కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయించారు. పోలీసు శాఖలో 55 ఏళ్లకు పైబడిన వయసు వారందరినీ ఇంటి నుంచి పనిచేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు అనుమతించారు.

ఇక, కర్ణాటకలో తొలిసారిగా 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం గమనార్హం. ఆదివారం కర్ణాటకలో 1,267 కొత్త కేసులు నమోదు కాగా.. ఇందులో 783 బెంగళూరు నగరంలోనే నమోదైనట్లు కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒకే రోజు 20వేలకుపైగా కేసులు నమోదయిన మూడో దేశంగా భారత్ నిలిచింది.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!