క‌రోనా ఎఫెక్ట్ః ఆమె వ‌ల్ల ఐదుగురికి…! డాక్ట‌ర్‌కి కూడా పాజిటివ్

విదేశాల నుంచి వ‌చ్చిన వారి ద్వారా స్థానికుల‌కు వైర‌స్ సోకుతోంది. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఓ మ‌హిళ ద్వారా ఓ డాక్ట‌ర్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. టెస్టులు చేయ‌గా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది...

క‌రోనా ఎఫెక్ట్ః ఆమె వ‌ల్ల ఐదుగురికి...! డాక్ట‌ర్‌కి కూడా పాజిటివ్
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 26, 2020 | 7:27 AM

దేశంలో లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. విదేశాల నుంచి వ‌చ్చిన వారి ద్వారా స్థానికుల‌కు వైర‌స్ సోకుతోంది. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఓ మ‌హిళ ద్వారా ఓ డాక్ట‌ర్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. టెస్టులు చేయ‌గా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది.

ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లో పని చేస్తున్న ఓ వైద్యుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ డాక్ట‌ర్ ద్వారా ఆస్ప‌త్రికి వ‌చ్చినవారికి కూడా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని భావించి అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దీంతో మార్చి 12-18 తేదీల మధ్య మౌజ్‌పూర్ క్లినిక్‌కు వెళ్లిన పేషెంట్లు, ఇతరులను క్వారంటైన్‌లోకి వెళ్లాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. డాక్ట‌ర్‌కు భార్య, ఓ కూతురు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక పరీక్షల్లో డాక్టర్ భార్య, కూతురుకు కూడా పాజిటివ్‌గా తేలిన‌ట్లు స‌మాచారం. కాగా వారిని న‌మూనాల‌ను మరోసారి పరీక్షలకు పంపించిన‌ట్లుగా తెలుస్తోంది.

కాగా, కొవిడ్‌-19 వైర‌స్‌ బారిన పడ్డ ఆ డాక్టర్‌ను 15 రోజుల క్రితం వారి ఆస్ప‌త్రికి ఓ మహిళ వెళ్లి కలిసిందని, ఆమె ద్వారానే ఆయనకు వ్యాధి సంక్రమించిందని సమాచారం. అనారోగ్యం కార‌ణంగా ముందుగా ఆ డాక్టర్‌ని ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్‌లో చేర్చారు. అక్కడ్నుంచి సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో చికిత్స అనంత‌రం అత‌న్ని ఐసోలేషన్ రూమ్‌కి తరలించారు. బుధవారం ఉదయం నాటికి ఢిల్లీలో 30 మందికి కరోనా సోకగా.. వీరిలో ఐదుగురికి కరోనా సోకడానికి డాక్టర్‌ను కలిసిన మహిళే కారణమని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి.