Covaxin Trials: చిన్నారులపై కోవాక్సిన్ ట్రయల్స్.. పాట్నా ఎయిమ్స్‌లో ప్రయోగాలు..
Covaxin trials on children: దేశంలో 18 ఏళ్లు పైబడినవారందరికీ కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్న పిల్లలకు
Covaxin trials on children: దేశంలో 18 ఏళ్లు పైబడినవారందరికీ కోవిడ్19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్న పిల్లలకు కూడా టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ టీకా చిన్నారులపై ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. ఈ మేరకు పాట్నా ఎయిమ్స్‌లో చిన్నారులపై కోవిడ్ టీకా ట్రయల్స్ ప్రారంభించారు. ట్రయల్స్‌లో భాగంగా సుమారు 525 మంది చిన్నారులకు కోవ్యాక్సిన్ టీకాలు ఇవ్వనున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. టీకాలు ఇవ్వనున్న పిల్లలకు ముందుగా ఆర్టీ పీసీర్, యాంటిజెన్ టెస్టులు నిర్వహించనున్నట్లు సింగ్ వెల్లడించారు.
అయితే చిన్నారులకు వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం.. వారి ఆరోగ్య పరిస్థితులను నిరంతరం సమీక్షించనున్నట్లు డాక్టర్ సీఎం సింగ్ తెలిపారు. ఈ మేరకు పాట్నా ఎయిమ్స్‌లో చిన్నారులకు కోవాగ్జిన్ టీకాలు ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలపై ట్రయల్స్ నిర్వహించేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థకు గత మే 11వ తేదీన డీజీసీఐ నుంచి అనుమతినిచ్చింది. రెండేళ్ల నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న వారిపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు ఇటీవల నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సైతం వెల్లడించారు.
ఢిల్లీలోని ఎయిమ్స్, నాగపూర్‌లోని మెడిట్రినా హాస్పిటళ్లలోనూ ట్రయల్స్ కొనసాగనున్నాయి. ముందుగా పాట్నా ఎయిమ్స్‌లో ఒక్కో దశలో సుమారు 80 మంది వరకు పరీక్షించనున్నారు. ట్రయల్స్ కోసం అక్కడ రిజిస్ట్రేషన్ కూడా నిర్వహించారు. 13 ఏళ్ల పాట్నాకు చెందని బాలుడు ఈ ట్రయల్స్ కోసం ముందుగా పేరును నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: