Corona Data: కరోనా ప్రతిరోజూ లెక్కల్లో మీరిది గమనించారా? ప్రతి సోమవారం కేసులు తక్కువగా కనిపిస్తాయి..ఎందుకంటె..

Corona Data: కరోనా మహమ్మారి ప్రపంచంలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచీ అన్ని దేశాలలోనూ దీని బారిన పడిన ప్రజల సంఖ్యను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తున్నారు.

Corona Data: కరోనా ప్రతిరోజూ లెక్కల్లో మీరిది గమనించారా? ప్రతి సోమవారం కేసులు తక్కువగా కనిపిస్తాయి..ఎందుకంటె..
Corona Data
Follow us
KVD Varma

|

Updated on: Jun 03, 2021 | 5:30 PM

Corona Data: కరోనా మహమ్మారి ప్రపంచంలో దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచీ అన్ని దేశాలలోనూ దీని బారిన పడిన ప్రజల సంఖ్యను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తున్నారు. మన దేశంలో కూడా టీవీ చానెల్స్, వెబ్సైట్ లలో కరోనా మహమ్మారి లెక్కలు ప్రతిరోజూ వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు అధికారికంగా ప్రతి రోజూ కరోనా లెక్కల్ని వార్తా సంస్థలకు అందచేయడం.. వాటిని ఆయా సంస్థలు ప్రచురించడం చేస్తూ ఉన్నాయి. అధికారిక లెక్కలు ఇవి. వీటిని మీరూ ప్రతిరోజూ చూస్తూనే ఉండి ఉంటారు. అయితే, ఈ లెక్కలు జాగ్రత్తగా పరిశీలిస్తే, ఒక విషయం మీరు గమనించవచ్చు. ప్రతి సోమవారం దేశవ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తక్కువ ఉంటుంది. మళ్ళీ మంగళవారం ఎక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు.. గడిచిన సోమవారం మే 31 న దేశంలో కొత్త కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోయింది. కరోనాను ట్రాక్ చేసే ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర వెబ్‌సైట్లు వారి గణాంకాలను నవీకరించినప్పుడు, మే 31 న దేశంలో మొత్తం 1 లక్ష 26 వేల 698 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఆదివారం కంటే 17.45% తక్కువ. అదేవిధంగా, అంతకు ముందు సోమవారం అంటే, మే 24 న కూడా కరోనా గణాంకాలలో పెద్ద తగ్గుదల కనిపించింది.

కరోనా పాత గణాంకాలను మీరు పరిశీలిస్తే, దేశంలో కరోనా ప్రారంభం నుండి నేటి వరకు, ప్రతి సోమవారం కరోనాకు కొత్త కేసులు వచ్చే సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. వినడానికి ఇది చాలా మంచి వార్తే. కానీ, వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అసలైన, మన ప్రభుత్వ యంత్రాంగాల మాయాజాలం. మన కరోనా పరీక్షా విధానంలో ఆదివారం సెలవుదినం అవుతుందని డేటా స్పష్టంగా చూపిస్తుంది. కానీ, కరోనాకు కాదు.

ఈ లెక్కలు ఒకసారి చూడండి..

మే నెల 2021 లో..

మొదటి సోమవారం:

  • తేదీ.. మే 2 న ఆదివారం దేశవ్యాప్తంగా 3,68,060 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ..  3న సోమవారం 3,57,316 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ..  4న మంగళవారం 3,67,334 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినట్టు లెక్కలు వచ్చాయి.

దీని ప్రకారం సోమవారం 2.92 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అయింది. మంగళవారం వచ్చేసరికి ఇది 6.95 శాతం పెరిగిపోయింది.

రెండో సోమవారం:

  • తేదీ.. మే09న ఆదివారం దేశవ్యాప్తంగా 3,66,494 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ.. 10న సోమవారం 3,29,942 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ.. 11న మంగళవారం 3.48,421 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినట్టు లెక్కలు వచ్చాయి.

దీని ప్రకారం సోమవారం 9.98 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అయింది. మంగళవారం వచ్చేసరికి ఇది 5.61 శాతం పెరిగిపోయింది.

మూడో సోమవారం:

  • తేదీ.. మే16న ఆదివారం దేశవ్యాప్తంగా 2,81,386 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ.. 17న సోమవారం 2,63,583 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ.. 18న మంగళవారం 2,67,334 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినట్టు లెక్కలు వచ్చాయి.

దీని ప్రకారం సోమవారం 6.35 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అయింది. మంగళవారం వచ్చేసరికి ఇది 1.15 శాతం పెరిగిపోయింది.

నాలుగో సోమవారం:

  • తేదీ.. మే23న ఆదివారం దేశవ్యాప్తంగా 2,22,375 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ..  24న సోమవారం 1,96,427 కేసులు నమోదు అయ్యాయి.
  • తేదీ..  25న మంగళవారం 2,08,921 కేసులు పాజిటివ్ కేసులు వచ్చినట్టు లెక్కలు వచ్చాయి.

దీని ప్రకారం సోమవారం 11.67 శాతం కరోనా కేసుల్లో తగ్గుదల నమోదు అయింది. మంగళవారం వచ్చేసరికి ఇది 6.36 శాతం పెరిగిపోయింది.

ఈ లెక్కలు చూస్తే మీకు అర్థం అయ్యే ఉంటుంది. ప్రతి సోమవారం కేసుల నమోదు తక్కువగా ఉంటోంది. మంగళవారం కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. (సోమవారం కేసుల సంఖ్య అంతే అది ఆదివారానికి చెందిన లెక్క. ఎందుకంటే, గడచినా 24 గంటల్లో నమోదు అయిన లెక్కలు మనకు తెలియ చేస్తారు.) అందువల్ల ఆదివారం కరోనా కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది అని మనం సరదాగా చెప్పుకోవచ్చు. కానీ, ఇలా లెక్కలు తేడాగా ఎందుకు కనిపిస్తున్నాయంటే..

ఆర్టీ-పిసిఆర్ పరీక్ష నివేదిక పొందడానికి 24-48 గంటలు పడుతుంది. ఆదివారం పరీక్షా యంత్రాలకు సెలవు. అందువల్ల ఆ లెక్కలు తక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ కలిసి సోమవారం లెక్కలలోకి చేరిపోతాయి. దాంతో మంగళవారం కరోనా కేసులు పెరిగినట్టు కనిపిస్తుంది. ఇది ఇప్పుడే కాదు మొదటి వేవ్ సమయంలోనూ ఇలానే జరిగింది. సోమవారం వెలువడిన లెక్కలు తక్కువగానూ, మంగళవారం వెలువడిన లెక్కలు ఎక్కువగానూ కనిపించాయి. ఆదివారం దర్యాప్తులో లోపం కారణంగా, సోమవారం ఎక్కువ మంది పరీక్షా కేంద్రాల్లో పరీక్షల ఫలితాలు పొందుతారు. మరింత ఎక్కువ కేసులు నమోదు అవుతాయి. ఈ ప్రభావం మంగళవారం డేటాలో స్పష్టంగా కనిపిస్తుంది. కరోనా మొదటి వేవ్ నుండి ఆదివారం పరిశోధనలు తగ్గించబడ్డాయి, ఇది సోమవారం డేటాలో స్పష్టంగా కనిపిస్తుంది.

అంతెందుకు.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకూ మీరు ఏ సోమవారం లెక్కలు పరిశీలించినా తక్కువగానే కనిపిస్తాయి. మంగళవారం లెక్కలు ఎక్కువగానే కనిపిస్తాయి. అయితే, ఇక్కడో విచిత్రమైన విషయం కూడా ఉంది. నిజానికి ఇది ఆశ్చర్యకరం కూడాను.. ఆదివారం..సోమవారం మరణాల సంఖ్య మాత్రం తేడా ఉండదు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆదివారం రాష్ట్రాల్లో కరోనా డేటాను నివేదించడంలో ఉన్న సున్నితత్వం సోమవారం గణాంకాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మనదేశంలోనే కాదు అమెరికా, ఐరోపాలో కూడా వీకెండ్ ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ ఈ లోపం శని, ఆదివారాలు రెండు రోజులూ కనిపిస్తుంది.

అదండీ విషయం.. సో, ఆదివారం కరోనా కేసులు ఎక్కువ కనిపించలేదు అని సరదా పడటానికి లేదు.. ఆ లెక్కలు సోమవారం కేసుల్లో ప్రతిఫలిస్తాయి. డేటా సర్దుబాటు మాత్రమే ఇది. కరోనా ఆదివారం రెస్ట్ తీసుకుంటుంది. వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అని మాత్రం అనుకోవద్దు.

Also Read: Mobile ICU Buses: కోవిడ్ బాధితులకు అందుబాటులో మెడికల్‌ యూనిట్‌ బస్సులు.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Covid-19: వైద్యులపై కొనసాగుతున్న కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో తెలుగు రాష్ట్రాల్లో 66 మంది మృత్యువాత

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!