Covid Vaccination: ఫోర్త్ వేవ్ వార్నింగ్స్‌తో కేంద్రం అప్రమత్తం.. 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే ఛాన్స్
మహమ్మారి కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఫోర్త్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది కేంద్ర సర్కార్.
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు(COVID-19) మళ్లీ పెరుగుతున్నాయి. చైనా, యూరప్ దేశాల్లో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిన కేంద్రం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇచ్చే విషయంపై కేంద్రం యోచిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి మూడో డోసు నిబంధన అడ్డంకిగా మారుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రికాషన్ డోస్ పేరుతో, మూడో డోసు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన వారికి కూడా బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడో డోసు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
ఉచిత టీకా కార్యక్రమంలో భాగంగా ఇస్తారా? ప్రైవేటులో డబ్బులు చెల్లించి వేసుకోవాలా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది జనవరి 16న దేశంలో కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేయడం ప్రారంభించాయి ప్రభుత్వాలు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి కో-మార్బిడిటీ ఉన్న వాళ్లకు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు.
ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా తీసుకునే అవకాశం కల్పించారు అధికారులు. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేశారు. ఇటీవల జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వయసు వారికి, మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వయసు వారికీ టీకా తీసుకునే వెసులుబాటును కల్పించింది కేంద్రం. తాజాగా బూస్టర్ డోస్‌పై కసరత్తు చేస్తోంది.
ఇవి కూడా చదవండి: Viral Video: లక్ష్యం కోసం రోజూ అర్ధరాత్రి 10 కి.మీటర్ల పరుగు.. ఎందుకో తెలుసా..?
Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..