Lockdown: లాక్‌డౌన్‌ భయాలు.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ ఫోన్‌, టీవీల ధరలు..

Lockdown: కరోనా (Corona) మహమ్మారి కారణంగా ఆరోగ్య వ్యవస్థపై ఏ స్థాయిలో ప్రభావం పడిందో, ఆర్థిక వ్యవస్థపై అలాంటి ప్రభావమే చూపింది. ప్రపంచదేశాలన్నీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారీగా ఉత్పాదక తగ్గడంతో పలు రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి...

Lockdown: లాక్‌డౌన్‌ భయాలు.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ ఫోన్‌, టీవీల ధరలు..
Follow us

|

Updated on: Mar 22, 2022 | 12:49 PM

Lockdown: కరోనా (Corona) మహమ్మారి కారణంగా ఆరోగ్య వ్యవస్థపై ఏ స్థాయిలో ప్రభావం పడిందో, ఆర్థిక వ్యవస్థపై అలాంటి ప్రభావమే చూపింది. ప్రపంచదేశాలన్నీ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. భారీగా ఉత్పాదక తగ్గడంతో పలు రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే తాజాగా భారత్‌లో కరోనా కంట్రోల్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నా.. కరోనా పుట్టనిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో మరోసారి ఎలక్ట్రానిక్‌ ధరలపై ప్రభావం చూపనుందన్న వార్తలు వస్తున్నాయి.

కరోనా ప్రభావంతో చైనాలోకి టెక్‌ హబ్‌ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌ నగరంలో ప్రస్తుతం కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఏ క్షణంలోనైనా లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చైనాలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో.. ఒకవేళ నిజంగానే షెన్‌జెన్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తే స్మార్ట్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌ దిగుమతి చేసుకునే ఎలక్ట్రికల్‌ ప్రొడక్ట్స్‌లో సుమారు 20 నుంచి 50 శాతం షెన్‌జెన్‌ నగరం నుంచే వస్తాయి. ఈ కారణంతోనే ఎలక్ట్రానిక్‌ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో షెన్‌జెన్‌లో లాక్‌డౌన్‌ విధిస్తే.. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై ప్రభావం పడుతుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ రీసెర్చ్ డైరెక్టర్ నవ్‌కేంద్రసింగ్ వెల్లడించారు.

Also Read: RRR Movie : ఆర్ఆర్ఆర్ థియేటర్ దగ్గర హైటెన్షన్.. ఆత్మహత్యాయత్నం చేసిన తారక్ అభిమాని..

Girl Murder: పాకిస్తాన్‌లో దారుణం.. 18 ఏళ్ల హిందూ యువతిని కాల్చి చంపిన దుండగులు

Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

Latest Articles