Nitin Gadkari: MEILతో దేశానికి రూ.5వేల కోట్లు ఆదా.. పార్లమెంటు సాక్షిగా మేఘా ఇంజినీరింగ్‌కు కేంద్ర మంత్రి ప్రశంసలు
పార్లమెంట్ సాక్షిగా మేఘా ఇంజినీరింగ్‌పై ప్రశంసలు కురిపించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. MEIL కంపెనీ వల్ల దేశానికి రూ.5వేల కోట్లు ఆదా అయిందని ప్రశంసించారు.
Nitin Gadkari praises MEIL: పార్లమెంట్(Parliament) సాక్షిగా మేఘా ఇంజినీరింగ్(Megha Engineering and Infrastructures Limited)పై ప్రశంసలు కురిపించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. MEIL కంపెనీ వల్ల దేశానికి రూ.5వేల కోట్లు ఆదా అయిందని ప్రశంసించారు. జోజిల్లా పాస్(Zojila Pass Tunnel) నిర్మాణానికి అనేక దేశాల నుంచి కూడా నిర్మాణ సంస్థల్ని పిలిచామని.. అయితే MEIL అతి తక్కువ ధర కోట్ చేసిందని ప్రకటించారు. రూ.12వేల కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో.. MEIL వల్ల 5 వేల కోట్ల రూపాయలు మిగిలిందన్నారు. లడఖ్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతూ జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణం చేపట్టింది మేఘా సంస్థ.
జాన్ ఎఫ్ కెన్నెడీ మాటల నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభకు తెలిపారు. మన రహదారులు భారతదేశ శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయని ఆయన అన్నారు. స్వావలంబన, సంతోషకరమైన సంపన్న భారత్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 2024 ముగిసేలోపు భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలు అమెరికాతో సమానంగా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు. దేశ శ్రేయస్సును దృష్ట్యా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా నిర్మాణాలు చేపడుతున్న మేఘా కంపెనీ సేవలు అభినందనీయమని గడ్కారీ అన్నారు.
జోజిల్లా పాస్ శ్రీనగర్-కార్గిల్-లేహ్ రహదారిపై కాశ్మీర్ లోయ – లడఖ్ మధ్య లింక్‌ను అందిస్తుంది. ఇది లడఖ్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. ఈ వ్యూహాత్మక పాస్‌ను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) తెరిచింది. ఇది 11,650 అడుగుల ఎత్తులో నిర్మించింది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. ఈ పాస్ సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ చివరి నాటికి మూసివేడం జరుగుతుంది. తదుపరి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో తెరుస్తారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) జమ్మూ – కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో అత్యంత గౌరవనీయమైన జోజిలా పాస్ టన్నెల్ నిర్మాణం కోసం కాంట్రాక్టును పొందింది. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ L-1 గా ఉద్భవించింది. ప్రాజెక్ట్ పరిభాషలో, అత్యల్ప బిడ్డర్ని L-1 అంటారు.
ఈ ప్రాజెక్ట్ కోసం కంపెనీ అత్యల్పంగా రూ.4,509.50 కోట్ల బిడ్ చేసింది. నేషనల్ హైవేస్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్) ఫైనాన్స్ బిడ్‌లను ఖరారు చేసింది. ప్రాజెక్ట్ చాలా కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో పని అవసరం. ఈ ప్రాజెక్టును కేవలం 72 నెలల్లో పూర్తి చేస్తామని ఎంఈఐఎల్ డైరెక్టర్ చౌదరి సుబ్బయ్య హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం 33 కి.మీ పొడవుతో ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా నిర్మించారు. మొదటి భాగంలో 18.50 కి.మీ మేర రహదారి, రెండో భాగంలో 14.15 కిలోమీటర్ల మేర జోజిలా టన్నెల్‌ను హార్స్‌షూ ఆకారంలో నిర్మించారు. సొరంగం 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో రెండు లేన్ల రహదారిని కలిగి ఉంటుంది.
ఇదిలావుంటే, శ్రీనగర్ నుండి లేహ్ వరకు ఏడాది పొడవునా వాహనాలు నడవలేవు. చలికాలంలో ఆరు నెలల పాటు ఈ రహదారి మూసివేయబడి ఉంటుంది. ఈ సమయంలో సైనిక వాహనాలు కూడా ఈ రహదారిపై నడవలేవు. ఇతర మార్గాలను ఉపయోగించడం చాలా ఖరీదైనది. అంతేకాకుండా చాలా సమయం పడుతుంది. అందుకే సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ వరకు సాక్ రోడ్ టన్నెల్ నిర్మించాలనే ప్రతిపాదన చాలా ఏళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. సోనామార్గ్ – కార్గిల్ మధ్య Z-మోర్ టన్నెల్ నుండి జోజిలా టన్నెల్ వరకు జోజిలా పాస్ ప్రాంతంలో జాతీయ రహదారి-1పై ప్రాజెక్ట్ నిర్మించారు. ఇది చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్. భూమి ఉపరితలం నుంచి సగటున 700 మీటర్ల దిగువన సొరంగాన్ని నిర్మించారు.
సొరంగం నిర్మించిన ప్రదేశం సంక్లిష్టమైన పర్వత ప్రాంతం. అక్కడ మంచు తుఫానులు వీస్తుంటాయి. ఏడాదిలో 8 నెలల పాటు అక్కడ మంచు పేరుకుపోతుంది. అందువల్ల ఆ స్థలంలో సొరంగం నిర్మాణం అంత సులువు కాదు. ప్రాజెక్ట్ సైట్ సమీపంలో ఒక నది కూడా ప్రవహిస్తుంది. అందువల్ల ప్రాజెక్ట్ స్థలంలో నీరు, మంచు పేరుకుపోతూనే ఉంటుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ప్రజలందరికీ కాశ్మీర్ నుండి లడఖ్ వరకు రోడ్డు ప్రయాణాన్ని సులభతరం చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద, శ్రీనగర్ నుండి బల్తాల్ వరకు హైవే టన్నెల్ కూడా నిర్మించడం జరిగింది. ఈ సొరంగం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కార్గిల్ సమీపంలోని బల్తాల్ బేస్ క్యాంపును అమర్‌నాథ్ యాత్రకు వినియోగించనున్నారు.
Read Also….