బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Rampurhat Violence: బెంగాల్ (West Bengal) మరోసారి దారుణం జరిగింది. తెల్లవారుజామున బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో పది మంది సజీవ దహనమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్(TMC)  నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారు.

బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..
West Bengal 10 Including Wo
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 22, 2022 | 3:09 PM

బెంగాల్ (West Bengal) మరోసారి దారుణం జరిగింది. తెల్లవారుజామున బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో పది మంది సజీవ దహనమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్(TMC)  నాయకుడి హత్యకు ప్రతీకారంగా వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. వార్తా సంస్థ ANI ప్రకారం, గత రాత్రి సుమారు 10-12 ఇళ్లకు నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోయి 10 మంది చనిపోయారు. మరో 38 మంది గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అగ్నిప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమయ్యాయి, ప్రస్తుతం అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. రాంపూర్‌హట్ పట్టణం శివార్లలోని బొగతుయ్ గ్రామంలోని ఇళ్లలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలను వెలికి తీశామని, అగ్నిమాపక దళం అధికారి అయితే, ఘటనా స్థలం నుంచి 10 కాలిపోయిన మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, అప్పటికే పలువురు సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను వెలికితీసినట్లు అగ్నిమాపక దళ అధికారి తెలిపారు. డీఎంతో సహా బీర్భూమ్ జిల్లాకు చెందిన పలువురు పెద్ద అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పంచాయితీ నాయకుడు బదు షేక్ హత్యకు గురికాగా, ఆ హత్యకు ప్రతీకారంగా నిప్పంటించే ఘటన జరిగింది.

బీర్‌భూమ్‌లో జరిగిన రాజకీయ హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. సీఐడీ ఏడీజీ జ్ఞానవంత్ సింగ్, పశ్చిమ రేంజ్ ఏడీజీ సంజయ్ సింగ్, డీఐజీ సీఐడీ ఆపరేషన్ మీరజ్ ఖలీద్‌లకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందిస్తూ.. ‘రాంపూర్‌హాట్‌లో అగ్నిప్రమాదంలో మరణించినట్లు సమాచారం ఉందని.. అయితే దానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇది స్థానిక ప్రజల మధ్య జరిగిన చిన్న గొడవ అంటూ కొట్టిపడేశారు.

ఇవి కూడా చదవండి: Jaggareddy: ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా లొల్లి.. మరోసారి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు