AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggareddy: ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా లొల్లి.. మరోసారి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

మొన్న అంతెత్తు లేచిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ స్వరం మార్చారు.. పార్టీ అగ్రనేతలపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి కాస్త మెత్తబడ్డారు.

Jaggareddy: ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదు.. రేవంత్‌రెడ్డితోనే నా లొల్లి.. మరోసారి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Jaggareddy
Balaraju Goud
|

Updated on: Mar 22, 2022 | 1:32 PM

Share

MLA Jagga Reddy Comments: మొన్న అంతెత్తు లేచిన సంగారెడ్డి ఎమ్మెల్యే(Sangareddy MLA) జగ్గారెడ్డి ఇవాళ స్వరం మార్చారు.. పార్టీ అగ్రనేతలపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి కాస్త మెత్తబడ్డారు. కోపంలో ఏదో అంటామని.. అవతలి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే వెనక్కి తీసుకుంటానన్నారు. తనను ఎవరూ సంప్రదించడం లేదని.. ఈ పరిస్థితుల్లో మాట్లాడేందుకు బహుశా భయపడుతున్నారేమోనని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ముత్యాలముగ్గు సినిమాలో హీరోయిన్‌లా తన పరిస్థితి మారిపోయిందన్నారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్‌ పంచాయితీ కాదని, తనకు.. రేవంత్‌రెడ్డికి మధ్య గుణగణాల పంచాయితీగా చెప్పారు జగ్గారెడ్డి. సీఎం కేసీఆర్‌ హెల్త్‌పై రేవంత్‌రెడ్డి చెప్పిన విషయాలను బయటపెట్టాయన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నియమించిన ఏ వ్యక్తితోనైనా కలిసి పనిచేస్తానని చెప్పారు.

జగ్గారెడ్డి వర్సెస్ టీపీసీసీ.. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నదే. కానీ ఇప్పుడు ఇది వేరే లెవల్‌కు వెళ్లింది. జగ్గారెడ్డి సవాల్ చేయడం.. ఆ తర్వాత కొన్ని పదవుల నుంచి ఆయనను తప్పించడంతో.. ఆ తర్వాత కొంత మంది నేతలు ఢిల్లీ వెళ్లడం.. టీ కాంగ్రెస్‌లో మరింత హీట్ పెంచుతోంది. ఈనేపథ్యంలో జగ్గారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినందుకే తనను తెలంగాణ ద్రోహిగా ముద్రవేశారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రాజకీయాల్లో ఏ రోగానికి ఏ మందు పెట్టాలో తనకు బాగా తెలుసంటున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పటి నుంచి తన ఆట ఏంటో చూపిస్తా అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తన జీవితంలో ఇంతకంటే జఠిలమైన సమస్యలను ఎన్నో చూశా అన్నారు. అప్పుడే భయపడలేదు, ఇప్పుడు భయపడతానా అని ప్రశ్నించారు. తన గుణం ఏంటో.. అవతల వ్యక్తి గుణం ఏంటో అందరి ముందు క్లారిటీగా చెప్తానన్నారు.

రేవంత్‌పై పంచ్‌లు పేల్చారు జగ్గన్న. చంద్రబాబు దగ్గర రేవంత్‌ రెడ్డి ఏం రాజకీయం నేర్చుకున్నాడో అని సైటెర్లు వేశారు జగ్గారెడ్డి. రేవంత్‌రెడ్డి మెదక్‌ పర్యటనకు వెళ్తే నన్ను ఆహ్వానించలేదు. ఆ పర్యటనకు నన్ను పిలవకపోవడంతో నాకు కోపం వచ్చింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి పార్టీలో విలువ ఉండదా? పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలుపుకొనిపోయే పద్ధతి లేదా? ఏ ఆలోచన లేని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీతోనే ఎవరికైనా మేలు జరుగుతుంది. సోనియాగాంధీ కుటుంబం వల్లే పార్టీ గొప్ప స్థాయికి చేరింది. కాంగ్రెస్‌పై అభిమానంతో ఎప్పటినుంచో ఈ పార్టీలో కొనసాగుతున్నా. నాకు, సీఎం కేసీఆర్‌కు రాజకీయంగా ఎలాంటి వివాదాలు లేవు’’ అని జగ్గారెడ్డి అన్నారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్‌ రాజకీయం హస్తినకు చేరింది. లోకల్‌ పంచాయితీ ఢిల్లీకి మారింది. జగ్గారెడ్డిపై వేటేసిన పార్టీ నేతల్ని కలిసేందుకు స్టేట్‌ లీడర్లు ఢిల్లీ బాట పట్టారు. వీహెచ్‌తో పాటు భట్టి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే.. వీరికి కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలనే ఢిల్లీ బయల్దేరిన టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి వెనక్కి వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతల్ని కలిసిన రేవంత్‌.. తాజా రాజకీయాలపై చర్చించినట్టు సమాచారం. జగ్గారెడ్డి వ్యవహారం.. పార్టీ పరిస్థితుల్ని అధిష్ఠానానికి రేవంత్‌ వివరించినట్టు చెబుతున్నారు.