కరోనా కట్టడికి ఎబోలా మెడిసిన్ రెడీ.. ట్రయల్స్ షురూ..!
COVID 19: కంటికి కనిపించని శత్రువుతో యావత్ మానవజాతి పోరాటం చేస్తోంది. అదే కరోనా వైరస్ మహమ్మారి. ఈ కోవిడ్ 19 బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 13,069 మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక భారత్‌లో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా ఐదుగురు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు విడిచారు. మరోవైపు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు, విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలందరూ రాత్రింబవళ్ళు […]

COVID 19: కంటికి కనిపించని శత్రువుతో యావత్ మానవజాతి పోరాటం చేస్తోంది. అదే కరోనా వైరస్ మహమ్మారి. ఈ కోవిడ్ 19 బారిన పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 13,069 మంది మృతి చెందగా.. బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక భారత్‌లో 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా ఐదుగురు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు విడిచారు.
మరోవైపు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు, విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచదేశాల శాస్త్రవేత్తలందరూ రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇక తాజాగా కరోనా నివారణకు మందు దొరికినట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన 79 ఏళ్ల ఒక కరోనా బాదితుడిపై అక్కడి డాక్టర్లు ప్రయోగాత్మకమైన ఎబోలాకు వాడిన మందు ఇచ్చి నయం చేశారట.
సదరు వ్యక్తి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. డాక్టర్లు అతనికి రెమెడెసివిర్ మందును ఇచ్చారు. కరోనాకు విరుగుడు కనిపెట్టాలని కష్టపడుతున్న వారు.. ప్రయోగాత్మకంగా ఆ కరోనా బాధితుడికి ఎబోలా డ్రగ్ ఇచ్చి పరీక్షించారని తెలుస్తోంది. ఇక అది కాస్తా సత్ఫలితాలను ఇచ్చింది.
మిలన్‌కు దక్షిణంలో ఉన్న లిగురియాకు చెందిన ఆ వ్యక్తి కోలుకున్నాడని.. 12 రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడని అక్కడి అధికారులు వెల్లడించారు. ఒక్క అతనికే కాదు.. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న ఓ వృద్దురాలు, మరో 14 మంది అమెరికన్లను కూడా ఈ మందు ద్వారానే కరోనా నుంచి వైద్యులు కాపాడినట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ నివారణ కోసం ఇప్పటివరకు శాస్త్రవేత్తలు యాంటీ హెచ్ఐవి డ్రగ్ వాడారు. అయితే వారి ప్రయత్నాలు నిరాశను మిగిల్చాయి. కానీ ఎబోలా మందు ద్వారా వైరస్ నివారణ కావడంతో శాస్త్రవేత్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాంటీ హెచ్ఐవి డ్రగ్ కాంబినేషన్ లోపినావిర్-రిటోనావిర్‌లను వైరాలజిస్టులు కరోనా బాధితులపై ప్రయోగించగా.. అవి వ్యతిరేక ఫలితాలను ఇచ్చాయి. ఈ విషయంపై నాటింగ్‌మ్ ప్రొఫెసర్ జోనాథన్ బాల్ మాట్లాడుతూ.. కరోనా లాంటి మహమ్మారిని నివారించేందుకు చాలా రకాల కాంబినేషన్స్ ప్రయత్నించామని.. అందులో యాంటీ హెచ్ఐవి డ్రగ్ విఫలం కాగా.. ప్రయోగాత్మకంగా ఎబోలా మెడిసిన్ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు.
స్థానిక న్యూస్ పేపర్ జెనోవా టూడే ప్రకారం కరోనా బాధితుడికి మార్చి 7న రెమెడెసివిర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాన్ మార్టినో హాస్పిటల్ డాక్టర్లు కరోనా ట్రీట్మెంట్‌కు ఈ మందు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇక ఈ డ్రగ్ పని చేసిందని వైద్యులలో ఒకరు తెలిపారు. త్వరలోనే ఆ బాధితుడు ఇంటికి వెళ్లిపోవచ్చునని.. వైరస్ నయం అయిందని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా కరోనా వైరస్ నియంత్రణకు విరుగుడు దొరికితే.. ఇప్పుడు ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
For More News:
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..
కోవిడ్ లక్షణాలు ఉండి.. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరిస్తే చర్యలే..
కరోనా భయం.. జైలుకు నిప్పంటించిన ఖైదీలు…
కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు రాష్ట్రాలూ లాక్‌డౌన్..
తెలంగాణలో జనతా కర్ఫ్యూ.. ఆ సేవలకు మాత్రమే మినహాయింపు..
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు..
భారత్‌లో ఐదుకు చేరిన కరోనా మరణాలు…
వైరస్ వణుకు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు నెలల రేషన్ ఫ్రీ..
