COVID 19: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు… మొత్తంగా 8 నమోదు..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకోగా.. ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ సంఖ్య 8కి చేరింది...
COVID 19: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకోగా.. ఏపీలోనూ కోవిడ్ 19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆ సంఖ్య 8కి చేరింది. ఇటీవల లండన్ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వచ్చిన యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
కాగా, ఇప్పటివరకు మొత్తంగా 251 నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని.. అందులో 229 మందికి కరోనా నెగటివ్ అని తేలినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇక మరో 14 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. అటు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి.. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు.
For More News:
కొత్తగూడెం పోలీస్ అధికారి, వంట మనిషికి కరోనా.. 39కి చేరిన కేసులు..
ఇండియా లాక్ డౌన్.. ఏ సేవలకు బ్రేక్.? ఏవి ఉంటాయి.?
‘ఇంటికి రావద్దు ప్లీజ్’.. కరోనా అనుమానితుల ఇళ్లకు రెడ్ నోటిసులు..
కరోనా మరణ మృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 18 వేలు దాటిన మరణాలు..
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
కేటీఅర్ అన్నా.. మా ఊరికి పంపండి.. సోదరి విజ్ఞప్తి..
జక్కన్న అదిరిపోయే ఉగాది ట్రీట్.. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో విడుదల..