వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 81 లక్షలు… 4.40 లక్షల మరణాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 8,168,232 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 3415 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 440,523 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,265,483 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా, […]

వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 81 లక్షలు… 4.40 లక్షల మరణాలు..
World Coronavirus
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 16, 2020 | 9:42 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 8,168,232 చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 3415 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 440,523 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,265,483 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(2,188,392), మరణాలు(118,496) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 347,821 కేసులు నమోదు కాగా.. 10,015 మంది మృతి చెందారు. కాగా, ఇండియాలో యాక్టివ్ కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 2,188,392 కేసులు, 118,496 మరణాలు
  • బ్రెజిల్ – 891,896 కేసులు, 44,148 మరణాలు
  • రష్యా – 545,458 కేసులు, 7,284 మరణాలు
  • ఇండియా – 347,821 కేసులు, 10,015 మరణాలు
  • బ్రిటన్ – 298,136 కేసులు, 41,969 మరణాలు