జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న కరోనా టెన్షన్..

కరోనా మహమ్మారి జమ్ముకశ్మీర్‌ను టెన్షన్ పెడుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడు.. కొత్తగా మరో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జమ్ముకశ్మీర్‌లో పెరుగుతున్న కరోనా టెన్షన్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 16, 2020 | 9:47 PM

కరోనా మహమ్మారి జమ్ముకశ్మీర్‌ను టెన్షన్ పెడుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం నాడు.. కొత్తగా మరో 78 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో జమ్ముకశ్మీర్‌ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,298కి చేరింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. 16 కరోనా పాజిటివ్ కేసులు జమ్ము డివిజన్‌లో నమోదవ్వగా.. 62 కశ్మీర్‌ డివిజన్‌లో నమోదయ్యాయి. ప్రస్తుతం 2,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. కరోనా బారినపడి ఇప్పటి వరకు 63 మంది మరణించారని అధికారులు తెలిపారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నిత్యం వేలల్లో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 3.4 లక్షల మందికిపైగా కరోనా సోకగా.. 1.8 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1.5 లక్షల మంది కరోనాతో పోరాడుతున్నారు. ఇక మరణాల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. అయితే దేశ వ్యాప్తంగా రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో.. అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.