ఏపీ: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్‌దారులకు శుభవార్త..

Coronavirus Updates: లాక్ డౌన్ కారణంగా తమ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకోవాల్సిన చాలామంది లబ్ధిదారులు వేరే రాష్ట్రాల్లో ఉండిపోయారు. దీనితో ఈ నెల అందుకోవాల్సిన పెన్షన్ అందక కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇక అలాంటి వారికి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వాళ్లకు వచ్చే నెల రెండు పెన్షన్లను కలిపి ఒకేసారి అందజేస్తామని హామీ ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ నెల పెన్షన్లను వేలి ముద్రలు, ఐరిస్, […]

ఏపీ: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెన్షన్‌దారులకు శుభవార్త..
Follow us

|

Updated on: Apr 04, 2020 | 8:36 AM

Coronavirus Updates: లాక్ డౌన్ కారణంగా తమ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకోవాల్సిన చాలామంది లబ్ధిదారులు వేరే రాష్ట్రాల్లో ఉండిపోయారు. దీనితో ఈ నెల అందుకోవాల్సిన పెన్షన్ అందక కొందరు ఆందోళన చెందుతున్నారు. ఇక అలాంటి వారికి జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వాళ్లకు వచ్చే నెల రెండు పెన్షన్లను కలిపి ఒకేసారి అందజేస్తామని హామీ ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఈ నెల పెన్షన్లను వేలి ముద్రలు, ఐరిస్, సంతకాలు లేకుండానే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 164 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో నలుగురు డిశ్చార్జ్ అయ్యారు.. ఒకరు మరణించారు.

ఇది చదవండి: జగన్ సర్కార్ సంచలనం.. నాయి బ్రాహ్మణులకు రూ. 10వేలు అడ్వాన్స్‌..

Latest Articles