జగన్ సర్కార్ సంచలనం.. నాయి బ్రాహ్మణులకు రూ. 10వేలు అడ్వాన్స్‌..

Coronavirus Outbreak: రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో పని చేసే క్షురకుల(నాయి బ్రాహ్మణులు)కు రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో దేవాలయాల్లో భక్తులకు క్షవరం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులకు ఉపాధి లేకుండా పోయింది. దీనితో వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు […]

జగన్ సర్కార్ సంచలనం.. నాయి బ్రాహ్మణులకు రూ. 10వేలు అడ్వాన్స్‌..
Follow us

|

Updated on: Apr 03, 2020 | 7:25 PM

Coronavirus Outbreak: రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దేవాలయాల్లో పని చేసే క్షురకుల(నాయి బ్రాహ్మణులు)కు రూ. 10వేలు అడ్వాన్స్‌గా ఇస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో దేవాలయాల్లో భక్తులకు క్షవరం చేస్తూ జీవనం సాగిస్తున్న క్షురకులకు ఉపాధి లేకుండా పోయింది. దీనితో వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి.

ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8 ప్రముఖ దేవాలయాల్లో పని చేస్తున్న 517 మంది, 80 చిన్న దేవాలయాలలోని 451 మంది వెరిసి మొత్తంగా 968 మంది క్షురకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా వీరికి ఉపాధి లేకుండా పోయింది. అందుచేత తమను ఆదుకోవాలని కేశఖండనశాల జేఏసీ ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.

ఇక వారి విజ్ఞప్తి మేరకు క్షురకుడు పని చేసే దేవాలయం నుంచి ప్రభుత్వం రూ. 10వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి అన్నారు. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ మొత్తాన్ని నెలవారీ సులభ వాయిదాల్లో సంబంధిత దేవాలయానికి జమ చేయడం జరుగుతుందన్నారు.

ఇది చదవండి: ఫోర్బ్స్ 30లో చోటు దక్కించుకున్న హైదరాబాదీలు.. కేటీఆర్ ప్రశంసలు..