AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటికి కనబడని శత్రువుతో.. మానవ జాతి యుద్ధం చేస్తోంది: మోదీ

కంటికి కనబడని శత్రువుతో.. మానవ జాతి యుద్ధం చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఉద్రుతంగా ప్రబలుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం గందరగోళంలో..

కంటికి కనబడని శత్రువుతో.. మానవ జాతి యుద్ధం చేస్తోంది: మోదీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 19, 2020 | 8:23 PM

Share

కంటికి కనబడని శత్రువుతో.. మానవ జాతి యుద్ధం చేస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా ఉద్రుతంగా ప్రబలుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉందన్నారు. కరోనా వల్ల మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు నెలకొన్నాయి. మానవజాతిని కరోనా సంక్షోభంలోకి నెట్టింది. గత రెండు నెలల నుంచి మానవ జాతి కష్టాల్లో ఉంది. ఈ మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. అయినా ఇప్పటికీ వ్యాక్సిన్‌ను కనుక్కోలేకపోతున్నారన్నారు మోదీ.

కాగా.. ఓ వారం రోజుల పాటు నుంచి ఇంటి నుంచి బయటకు రావొద్దని.. మీకు కావాల్సిన వస్తువులను ఇంటికే చేరవేస్తామన్నారు. అలాగే.. ఇప్పటికే కరోనా అలెర్ట్‌తో స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, మాల్స్‌లను మూసివేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ని కేటాయించారు. అలాగే బయటకు వెళ్లకూడదని సూచనలు కూడా జారీ చేశారు మోదీ. ప్రతీ ఒక్కరూ స్వయం ప్రకటిత కర్ఫ్యూని.. పాటించాలన్నారు. అలాగే చేతులను, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇది ఎవరో ఒకరు చెప్పడం ద్వారా కాదు.. మీరే స్వయంగా పరిశ్రభతను పాటించాలన్నారు మోదీ.

ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8 వేల మంది మరణించగా.. రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఇండియాలోనూ విజృభిస్తోంది. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ.. 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారిక లెక్కలు వెలవడ్డాయి.

Read More this also:

 జబర్దస్త్ నుంచి బయటకు పంపించేస్తే.. నేను ఇది చేయడానికి సిద్ధం

అలెర్ట్: ఆ గ్రూపు రక్తం ఉన్నవారికి కరోనా ఎక్కువగా సోకుతుందట

కరోనా వచ్చిందనే భయంతో యువకుడు సూసైడ్

పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌కి మరో బ్యాడ్ న్యూస్

సిద్ధార్థ్‌ని త్వరగా వదిలించుకున్నా.. లేకుంటే నా లైఫ్ మరో సావిత్రిలా ఉండేది..

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..