కరోనా ఎఫెక్ట్..: సీఎం కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ వ్యాప్తంగా సడన్‌గా కరోనా పాజిటివ్ కేసులు 14కు చేరుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 14కు చేరుకున్నాయని.. వీరిలో ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రజలు లేరని.. అంతా విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ పాజిటివ్ వచ్చాయన్నారు. వీరిలో 5గురు విమానల్లో వచ్చారని.. మిగతా 9 మంది పలు మార్గాల్లో రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు […]

కరోనా ఎఫెక్ట్..: సీఎం కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: Mar 19, 2020 | 7:36 PM

తెలంగాణ వ్యాప్తంగా సడన్‌గా కరోనా పాజిటివ్ కేసులు 14కు చేరుకోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 14కు చేరుకున్నాయని.. వీరిలో ఒక్కరు కూడా మన రాష్ట్ర ప్రజలు లేరని.. అంతా విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ పాజిటివ్ వచ్చాయన్నారు. వీరిలో 5గురు విమానల్లో వచ్చారని.. మిగతా 9 మంది పలు మార్గాల్లో రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యారని తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడకుండా ఉండాలని.. అదే కరోనాకు విరుగుడు మందన్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారి కార్యక్రమాలను రద్దు చేసుకోమని సూచించామని.. ఇప్పటికే ముస్లింలు నిర్వహించే జగ్‌నేకే రాత్‌ను రద్దు చేశామని, అలాగే ఉగాది రోజున ప్రభుత్వం తరఫున నిర్వహించే పంచాంగ శ్రవణాన్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నామని.. ఈ టెలికాస్ట్ ద్వారానే ప్రజలు తమ ఇళ్లల్లో వీక్షించాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంతేకాదు.. శ్రీరామ నవమి ఉత్సవాలను కూడా రద్దు చేసినట్లు సీఎం ప్రకటించారు. ఇక ప్రజారవాణాకు సంబంధించి.. బస్సులు, క్యాబ్‌లు, టాక్సీల్లో సానిటేషన్ ఎక్కువగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సానిటేషన్ ఎక్కువ మొత్తంలో చేయాలని.. అది కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.