పాకిస్థాన్ కుట్రలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. హిందువులు, క్రిస్టియన్లను ఆకలితో..
దాయాది దేశమైన పాకిస్తాన్ చేసే కుట్రలు, కుతంత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యథారాజా తథా ప్రజా అన్నట్లుగా అక్కడి దరిద్రపు పోకడలు, కుళ్లు రాజకీయాలు అన్నీ ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కూడా ఆ దేశం వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. కోవిడ్ 19 దెబ్బకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. చాలామంది పేదవాళ్లు చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక అనేక అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో […]

దాయాది దేశమైన పాకిస్తాన్ చేసే కుట్రలు, కుతంత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యథారాజా తథా ప్రజా అన్నట్లుగా అక్కడి దరిద్రపు పోకడలు, కుళ్లు రాజకీయాలు అన్నీ ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో కూడా ఆ దేశం వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. కోవిడ్ 19 దెబ్బకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. చాలామంది పేదవాళ్లు చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక అనేక అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో పాకిస్తాన్‌లోని హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలు నిరంతరం బెదిరింపులు ఎదుర్కుంటున్నారు. కోవిడ్ -19 సంక్షోభం మధ్య పాక్‌లో హిందూ, క్రైస్తవ మైనారిటీలు ఆహారం కొరతను ఎదుర్కుంటున్నారని యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ తెలిపింది. ‘ఇలాంటి చర్యలను తక్షణమే ఖండించాలని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ అనురిమా భార్గవ అన్నారు. మైనారిటీలపై పాకిస్తాన్ చిన్న చూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా సమాచారం ప్రకారం ఇటీవల పాక్‌లోని కరాచీలో సేలనీ వెల్ఫేర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ వలస కూలీలకు, పేదవాళ్లకు ఆహారాన్ని అందించింది. ఆ సమయంలో హిందువులు, క్రిస్తియన్లు, ఇతర మతస్తులకు ఆహారం ఇవ్వడానికి నిరాకరించిందని యూఎస్ కమిషన్ వెల్లడించింది. దీనితో అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. “కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో పాకిస్తాన్‌లోని బలహీన వర్గాలు ఆకలితో పోరాడుతున్నాయి. వారిని, వారి కుటుంబాలను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారం ఇవ్వడం నిరాకరించకూడదు. వివిధ ఆర్గనైజేషన్లు అందించే ఆహార పదార్ధాలను హిందువులు, క్రైస్తవులు, ఇతర మతాల మైనారిటీలకు సమానంగా పంచాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరినట్లు అమెరికా వెల్లడించింది.
యూఎస్సీఐఆర్ఎఫ్ కమీషనర్ జానీ మోరీ మాట్లాడుతూ’ తాజాగా పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటితో మాట్లాడుతూ.. కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆకలి చావులు జరగకుండా చూసుకోవడంలో దేశ ప్రభుత్వాలు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారని గుర్తు చేశారు. అటు కరాచీలో హిందువులకు, క్రిస్టియన్లకు ఆహారం ఇవ్వడానికి సేలనీ వెల్ఫేర్ ఇంటర్నేషనల్ ట్రస్టు నిరాకరించిందని రిపోర్ట్స్ రాగానే.. ఎది ఫౌండేషన్, జేడీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లాంటి ఎన్జీఓలు మాత్రం ఈ రెండు మైనారిటీ కమ్యూనిటీలకు రేషన్ సక్రమంగా సరఫరా చేశారు. ఏది ఏమైనా పాకిస్తాన్‌లో కొద్దిపాటిగా ఉన్న హిందూ మైనారిటీలు తరుచూ తమ హక్కులను కోల్పోతున్నారని చెప్పక తప్పదు.