ఆన్‌లైన్‌లో బోధన కొనసాగించండి.. విద్యాసంస్థలకు కేంద్రం సూచన..
కరోనా మహమ్మారి విస్తరణ క్రమంలో.. లాక్‌డౌన్ సందర్భంగా దేశంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన కొనసాగించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. అన్ని విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ

కరోనా మహమ్మారి విస్తరణ క్రమంలో.. లాక్‌డౌన్ సందర్భంగా దేశంలోని విద్యా సంస్థలన్నీ ఆన్‌లైన్ ద్వారా విద్యాబోధన కొనసాగించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. అన్ని విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ దిశగా ప్రయత్నిస్తాయని ఆశిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా నేటి నుంచి రెండో దశ లాక్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో… ఏయే సేవలు కొనసాగుతాయో, ఏయే సంస్థలను మూసివేయాలో చెబుతూ కేంద్ర హోంశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
కాగా.. మార్గదర్శకాల ప్రకారం, అన్ని విద్యా, శిక్షణ, కోచింగ్ సంస్థలు మూసివేయబడతాయి. అయినప్పటికీ ఈ నెల 20 నుంచి ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకు కొన్ని ఎంపిక చేసిన అదనపు కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. పరిమిత సంఖ్యలోని ఈ మినహాయింపులను ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాగాలు నిర్వహిస్తాయి.. అని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దూర దర్శన్, ఇతర విద్యా చానెళ్లను సాధ్యమైనంత వరకు విద్యా బోధన కోసమే వినియోగించాలి…’’ అని సూచించింది.