ఆ హిట్ మూవీ రీమేక్‌లో రవితేజ, రానా..!

టాలీవుడ్‌లో మరో మలయాళ చిత్రం రీమేక్‌ అవ్వబోతోంది. పృథ్వీరాజ్‌, బిజు మీనన్‌ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన 'అయ్యప్పన్ కుషియుమ్‌'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 3:37 pm, Wed, 15 April 20
ఆ హిట్ మూవీ రీమేక్‌లో రవితేజ, రానా..!

టాలీవుడ్‌లో మరో మలయాళ చిత్రం రీమేక్‌ అవ్వబోతోంది. పృథ్వీరాజ్‌, బిజు మీనన్‌ ప్రధానపాత్రలో మలయాళంలో మంచి విజయం సాధించిన ‘అయ్యప్పన్ కుషియుమ్‌’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్‌ పాత్రలో రానా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుండగా.. బిజు మీనన్‌ పాత్ర కోసం బాలకృష్ణను అనుకుంటున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నటించేందుకు బాలయ్య అంత ఆసక్తిని చూపలేదని టాక్‌. ఈ నేపథ్యంలో ఈ పాత్ర కోసం మాస్‌ మహారాజ రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హీరో ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని తెలుస్తోంది. మరి ఈ రీమేక్ పై మాస్ రాజా అభిప్రాయమేంటో చూడాలి.

ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ దర్శకుడిగా సుధీర్‌ వర్మ లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, సురేష్ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం. మరి ఈ రీమేక్‌లో ఎవరు నటించబోతున్నారు..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: అతడి విషయంలో మహేష్‌ను పరశురామ్ ఒప్పిస్తాడా..!