అతడి విషయంలో మహేష్‌ను పరశురామ్ ఒప్పిస్తాడా..!
పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా..

పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఇక లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకునే పనిలో దర్శకుడు పడ్డారట.
ఇక ఈ మూవీకి సంగీత దర్శకుడిగా థమన్‌వైపు మొగ్గుచూపుతున్నారట మహేష్. అయితే ఆ విషయంలో గోపి సుందర్‌ను అనుకుంటున్నారట పరశురామ్. తాను తెరకెక్కించిన గీతా గోవిందం సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఆ మూవీ పెద్ద విజయం సాధించడం వెనుక.. గోపి పాత్ర కూడా చాలానే ఉంది. ఈ నేపథ్యంలో అతడినే మహేష్ సినిమాకే తీసుకోవాలని పరశురామ్ అనుకుంటున్నారట. మరి ఈ విషయంలో చివరకు ఎవరి మాట నెగ్గుతుంది..? మహేష్ తదుపరి సినిమా సంగీత దర్శకుడు ఎవరు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: ‘ఆచార్య’ స్టోరీ రివీల్ చేసిన చిరు.. కొరటాల మళ్లీ అలాంటి పాత్రతోనే..!