EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశమే అయినా ఇంకా వారిలో అయోమయం నెలకొంది. కొంతమందికి ఇంకా గందరగోళం నెలకొంది. మీ ఖాతాలనుంచి ఈఎంఐలు డెబిట్ అవుతాయని, బ్యాంకుల్లో […]

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:51 PM

Coronavirus Outbreak: దేశంలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఈఎంఐలను మూడు నెలల పాటు చెల్లించనక్కరలేదని, రుణాలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ తాజాగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన అటు కమర్షియల్, రీజనల్, రూరల్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వర్తిస్తుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశమే అయినా ఇంకా వారిలో అయోమయం నెలకొంది. కొంతమందికి ఇంకా గందరగోళం నెలకొంది. మీ ఖాతాలనుంచి ఈఎంఐలు డెబిట్ అవుతాయని, బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉంచాలని మెసేజ్‌లు రావడమే అందుకు కారణం. అయితే తాజాగా పలు బ్యాంకులు ఖాతాదారులకు ట్వీట్ల ద్వారా గుడ్ న్యూస్ అందించాయి.

ఆర్బీఐ అన్ని లోన్ల EMIలపై మూడు నెలల పాటు మారిటోరియం విధిస్తు తీసుకున్న నిర్ణయాన్ని తమ కస్టమర్లకు బదలాయిస్తూ ఇప్పటివరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ అఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, బ్యాంక్ అఫ్ ఇండియా, ఐఓబీ, ఐడీబీఐ, యుసీఓ, ఇండియన్, సిండికేట్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. దీనితో మార్చి 1 నుంచి మే 31 వరకూ అన్ని లోన్ల EMI చెల్లింపులపై కస్టమర్లకు వెసులుబాటు దక్కనుండగా.. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలోని బ్యాంకును సంప్రదించాల్సి ఉంది.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనదే.. హిట్‌మ్యాన్‌ భారీ విరాళం..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..