మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

Coronavirus Outbreak: ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కు మందుబాబులకు కష్టాలు అన్ని ఇన్ని కాదు. చుక్క పడితేనే గానీ నిద్రపట్టని వీళ్లకు.. ప్రభుత్వాలు మద్యం షాపులు మూసేయడంతో కొంతమందికి కంటి మీద కునుకు లేకుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు నెలల పాటు బీర్లు ఫ్రీగా ఇస్తామంటే.. వారికి టక్కున పోయిన […]

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:52 PM

Coronavirus Outbreak: ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ కు మందుబాబులకు కష్టాలు అన్ని ఇన్ని కాదు. చుక్క పడితేనే గానీ నిద్రపట్టని వీళ్లకు.. ప్రభుత్వాలు మద్యం షాపులు మూసేయడంతో కొంతమందికి కంటి మీద కునుకు లేకుంటే.. మరికొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా మూడు నెలల పాటు బీర్లు ఫ్రీగా ఇస్తామంటే.. వారికి టక్కున పోయిన ప్రాణం వెనక్కి వచ్చేస్తుంది. అసలు అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఇది బీర్లు తాగేవారికి శుభవార్త. ఓ కంపెనీ ఏకంగా మూడు నెలల పాటు బీర్లను ఫ్రీగా ఇస్తుందట.. అయితే ఓ కండిషన్ కూడా ఉందండి. మీకు బీర్లు కావాలంటే ఓ కుక్కను దత్తత తీసుకోవాలి. దానికి సపర్యలు అన్ని చూసుకుంటేనే బీర్లు మూడు నెలల పాటు ఫ్రీగా ఇస్తామంటూ ఓ సంస్థ ప్రకటించింది. అయితే ఇది ఇండియాలో కాదులెండి.. ఈ అవకాశం కేవలం అమెరికాలో ఉండేవారికి మాత్రమే. అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. దీనితో చాలామంది జంతువులకు సంబంధించిన సంస్థలు మనుషులను దగ్గరకి రానివ్వడం లేదు. వారి ద్వారా కుక్కలకు ఎక్కడ కరోనా సోకుతుందోనన్న భయం.

అయితే మిడ్ వెస్ట్ సంస్థ మాత్రం కుక్కలను దత్తత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు బుష్ బీర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఎవరైతే కుక్కను దత్తత తీసుకుంటారో వారికి మూడు నెలల పాటు బుష్ బీర్ కంపెనీ ఉచితంగా బీర్లను అందించనుంది. ఇక కుక్కను దత్తత తీసుకున్న వారు.. ప్రూఫ్ కింద కుక్కతో దిగిన ఫోటోను బుష్ బీర్ కంపెనీ ఫేస్ బుక్ – వాట్సాప్ – ఇన్ స్టాగ్రామ్ పేజీలకు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ముందుగా పంపిస్తారో వారికి 100 డాలర్ల(రూ.7500) రివార్డ్ ను కూడా ఇవ్వనుంది. కాగా, ఈ ఆఫర్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆ బీర్ కంపెనీ స్పష్టం చేసింది.

ఇవి చదవండి:

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

కరోనా లాక్ డౌన్.. మూడు నెలలు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదా..?