దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనదే.. హిట్‌మ్యాన్‌ భారీ విరాళం..

Covid-19: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. కరోనాపై పోరుకు తన వంతు సాయంగా రూ. 80 లక్షల విరాళాన్ని అందజేశాడు. ప్రధాన మంత్రి సహాయ నిధి(పీఎం-కేర్స్)కు రూ.45లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ. 5 లక్షలు, వీధి కుక్కలా సంరక్షణకు రూ. 5 లక్షల విరాళమిచ్చాడు. ‘కరోనా మహమ్మారిని నియంత్రించి దేశం మళ్ళీ […]

దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనదే.. హిట్‌మ్యాన్‌ భారీ విరాళం..
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:49 PM

Covid-19: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అండగా నిలిచాడు. కరోనాపై పోరుకు తన వంతు సాయంగా రూ. 80 లక్షల విరాళాన్ని అందజేశాడు. ప్రధాన మంత్రి సహాయ నిధి(పీఎం-కేర్స్)కు రూ.45లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.25లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ. 5 లక్షలు, వీధి కుక్కలా సంరక్షణకు రూ. 5 లక్షల విరాళమిచ్చాడు.

‘కరోనా మహమ్మారిని నియంత్రించి దేశం మళ్ళీ తన పాదాలపై తాను నిలబడేలా చేసే బాధ్యత మనందరిపై ఉంది. నేను పీఎం కేర్స్ ఫండ్స్ కు 45 లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయనిధికి 25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు 5 లక్షలు, వీధి కుక్కల రక్షణకు 5 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. మన నాయకుల వెంట అండగా ఉంటూ కరోనాపై కలిసికట్టుగా పోరాడడాం అని’ రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

కాగా, ఇప్పటికే కరోనాపై యుద్దంలో మేము సైతం అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, అజింక్య రహనే, సౌరవ్ గంగూలీ లాంటి క్రీడాకారులు తమవంతు సాయంగా విరాళాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఇక మహిళా క్రికెటర్లలో మిథాలి రాజ్ రూ. 10 లక్షలు, పూనం యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ రూ. 1.5 లక్షలు విరాళాలుగా ఇచ్చారు.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..

Latest Articles
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు