అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరో వైపు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా బలమైన ఈదురుగాలులతో వర్షం పెను బీభత్సం సృష్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కొనకపోవడం, ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది.

అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
Formars
Follow us

| Edited By: Srikar T

Updated on: May 08, 2024 | 9:45 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. ఓ వైపు వర్షం.. మరో వైపు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఇప్పుడు అకాల వర్షం నిండా ముంచింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా బలమైన ఈదురుగాలులతో వర్షం పెను బీభత్సం సృష్టించింది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే.. తీసుకొచ్చిన వడ్లను సకాలంలో కొనకపోవడం, ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడ తడిసిపోయింది. వారం, పది రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబోస్తూ కాపాడుకున్న రైతులు, నిన్న కురిసిన భారీ వర్షం నుంచి రక్షించుకునేందుకు నానా ఇబ్బందులూ పడ్డారు. అయినా కళ్ల ముందే ధాన్యం తడిసిపోయి, కొట్టుకుపోతుంటే అన్నదాత కుదేలయ్యాడు.

కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం వెంట వెంటనే తూకం వేయకపోవడం వల్లే నష్టం జరిగిందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. కొన్ని మండలాల్లో భారీ చెట్లు రోడ్డుపైన విరిగి పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాలిదుమారంతో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడడంతో చాలా గ్రామాలకు కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. కోనరావుపేట మండలం వట్టిమల్లలో పిడుగుపాటుకు రైతు దాదె జలపతికి చెందిన గేదె చనిపోయింది.

గాలిదుమారంతో పలు గ్రామాల్లో మామిడి తోటల్లోని కాయలు రాలి కిందపడ్డాయి. దీంతో రైతులకు భారీగా నష్టం జరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజులుగా ఎండ వేడిమితో అల్లాడిన జనానికి చల్లబడ్డ వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ నెల వ్యవధిలో రెండు సార్లు అకాల వర్షాలు ఈదురుగాలులు, వడగళ్ల దెబ్బతో పంట పొలంలో ఉన్న వరి చేనులో గింజలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వేలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే వస్తున్నాయి. వరుస అకాల వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని రైతులు బోరుమంటున్నారు. కళ్లెదుటే చేతికి వచ్చిన పంట నష్టపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వరి పంటలు, మామిడి..

ఐకెపిలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు చేయాలని, నష్టం వాటిల్లిన మామిడి తోటలకు నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..