- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Shardul Thakur And Shivam Dubey Responsible For Chennai Super Kings Loss Fans Trolling Them On Social Media
IPL 2024: చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే ప్రధాన కారణం.. ఏకిపారేస్తోన్న అభిమానులు
చిన్నస్వామి మైదానంలో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించిన నాలుగో జట్టుగా అవతరించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన CSK జట్టు రికార్డు స్థాయిలో 6వ సారి ట్రోఫీని ఎగరేసుకొని పోయే అవకాశాన్ని కోల్పోయింది.
Updated on: May 19, 2024 | 9:30 PM

చిన్నస్వామి మైదానంలో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించిన నాలుగో జట్టుగా అవతరించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన CSK జట్టు రికార్డు స్థాయిలో 6వ సారి ట్రోఫీని ఎగరేసుకొని పోయే అవకాశాన్ని కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. 219 పరుగుల విజయలక్ష్యంతో 201 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ప్లేఆఫ్‌కు చేరే సువర్ణావకాశం ఉన్న సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేదు. బదులుగా, RCB ఇచ్చిన లక్ష్యానికి కేవలం 17 పరుగుల దూరంలో ఉన్నప్పటికీ నేరుగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లి ఉండేది. కానీ జట్టులో ముఖ్యమైన బౌలర్లు, కీలక బ్యాటర్లు అందుబాటులో లేకపోవడమే CSK ఓటమికి ప్రధాన కారణం.

ముఖ్యంగా జట్టు బౌలింగ్ విభాగాన్ని నడిపిస్తున్న అనుభవజ్ఞుడైన పేసర్ శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ లో లయ కోల్పోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ 4 ఓవర్లలో 61 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

ఇక బ్యాటింగ్‌లో జట్టు కీలక బ్యాటర్ శివమ్ దూబే పేలవమైన ఆటతీరును కనబర్చాడు. ఇది కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణం. రహానే వికెట్ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన దూబే.. రహానే ఇచ్చిన శుభారంభాన్ని కొనసాగించడంలో విఫలమయ్యాడు.

61 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న రచిన్ రవీంద్ర, శివమ్ దూబేతో కమ్యూనికేషన్ లేకపోవడంతో రనౌట్‌కు గురయ్యాడు. చివరకు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్న దూబే 15 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.




