ఐపీఎల్‌తో మారిన జాతకం.. ఏకంగా రూ. కోటి జీతం

5 May 2024

TV9 Telugu

ప్రస్తుతం ఐపీఎల్ 2024 తుది దశకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.

ఉత్కంఠగా ఐపీఎల్

ఐపీఎల్ ముగిసిన వెంటనే ఓ ఆటగాడి అదృష్టం మారనుంది. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా కోటి రూపాయలు కూడా అందుకోనున్నాడు.

మారనున్న అదృష్టం

మయాంక్ యాదవ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టెస్టు సిరీస్‌కి మయాంక్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బీసీసీఐ మాస్టర్ ప్లాన్

మయాంక్ యాదవ్ ప్రస్తుతం ఐపీఎల్ 2024 నుంచి ఫిట్‌గా లేనందున దూరంగా ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌కు అతడు ఫిట్‌గా ఉండేలా చూడాలని బీసీసీఐ కోరుతోంది.

ఐపీఎల్ నుంచి ఔట్

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, మయాంక్ ప్రస్తుతం NCAలో వైద్య బృందం, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీ పర్యవేక్షణలో ఉంటాడు.

NCAలోనే కసరత్తులు

మయాంక్‌ని టీమిండియాలోకి తీసుకునే ముందు, అతడిని ఇండియా ఏ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కు పంపాలన్నది బీసీసీఐ ప్లాన్. ఈ పర్యటన జూన్ లేదా జూలైలో జరగనుంది.

ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధం

ఈ పర్యటన తర్వాత, అతను ఆస్ట్రేలియాలో జరిగే 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ ఇండియాలో చేరనున్నాడు. ఈ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

నవంబర్ నుంచి 22 టెస్ట్ సిరీస్

ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టును కూడా మయాంక్‌కు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. నివేదిక ప్రకారం, దీని కింద అతనికి కోటి రూపాయలు లభిస్తాయి.

కోటి రూపాయాల జీతం