6 May 2024
TV9 Telugu
T20 ప్రపంచ కప్ 2024కి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొన్ని జట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించలేదు.
ప్రపంచకప్‌నకు ముందు పాక్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో రెండు టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది.
ఈ సిరీస్ తర్వాత, పాకిస్తానీ జట్టు వెస్టిండీస్-అమెరికాకు బయలుదేరుతుంది. అంతకంటే ముందు జట్టు నైతికతను పెంచడానికి PCB కీలక ప్రకటన చేసింది.
పాకిస్థాన్ కూడా చాలా కాలంగా వరల్డ్ కప్ గెలవాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో పీసీబీ భారీ నజరానా ప్రకటించింది.
ఐర్లాండ్-ఇంగ్లాండ్‌కు వెళ్లే ముందు పాక్ జట్టును కలిసిన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ, ప్రపంచ కప్ గెలిస్తే ప్రతి ఆటగాడికి 1 లక్ష డాలర్లు ఇస్తామని ప్రకటించారు.
అంటే, పాక్ జట్టు ప్రపంచకప్ గెలిస్తే, ప్రతి ఆటగాడికి 2.77 కోట్ల పాకిస్తానీ రూపాయల (83 లక్షల భారత రూపాయలు) బహుమతి లభిస్తుంది.
ఇప్పుడు బాబర్ అజామ్ జట్టు దీన్ని చేయగలదా లేదా అనేది టోర్నీ ప్రారంభమైన తర్వాతే తెలుస్తుంది. గత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌లో ఓడిపోయింది.
టీ20 ప్రపంచకప్ 2024 సమరానికి రంగం సిద్ధమైంది. జూన్ నుంచి ఫ్యాన్స్ ను ఫిదా చేసేందుకు ముస్తాబవుతోంది.