కరోనాపై వార్.. జీ 20 దేశాల సమైక్య శంఖారావం

కోవిడ్ 19 ని ఎదుర్కొనే విషయంలో జీ-20 కూటమి దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ.. ఈ వీరి మధ్య చర్చలు జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

కరోనాపై వార్.. జీ 20 దేశాల సమైక్య శంఖారావం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 31, 2020 | 6:56 PM

ప్రపంచ దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ పై యుధ్ధానికి జీ-20 దేశాల నేతలు సమాయత్తమయ్యారు. గ్లోబల్ ఎకానమీ తీవ్ర మాంద్యం లోకి దిగజారకుండా ఉండేందుకు 5 ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని వీరు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఈ నేతలు ఒకసారి దీనిపై చర్చలు జరపగా.. రెండో సారి తిరిగి సమావేశమవుతున్నారు. వీరి చర్చల ప్రధాన ఎజెండా కరోనాపై సమరమే.. ఆయా దేశాల మంత్రులు, బ్యాంకుల గవర్నర్లు ఈ రెండో విడత సమావేశంలో పాల్గొంటారని సౌదీ రాజు సల్మాన్ ప్రకటించారు. రొటేషన్ ప్రకారం జీ-20 దేశాల కూటమికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు.

కోవిడ్ 19 ని ఎదుర్కొనే విషయంలో జీ-20 కూటమి దేశాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వస్తున్న వేళ.. ఈ వీరి మధ్య చర్చలు జరగడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భారీ ప్యాకేజీలో తాము 344 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వర్ధమాన దేశాలను ఆదుకునేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా భారీ ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాలని, ఇందుకు తాము చొరవ తీసుకోవాలని ఈ దేశాల నాయకులు  నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో ఆంక్షలపై మారటోరియం విధించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సూచించారు. ఇందుకు అమెరికా అధినేత ట్రంప్ కూడా అంగీకరించారు. అయితే కరోనా మహమ్మారి వల్ల తలెత్తుతున్న ప్రమాదకర పరిణామాలను అన్ని దేశాలు గుర్తించాలని ట్రంప్ కోరారు.