సంచి పట్టి.. పంచె కట్టి.. రైతు బజార్‌లోకి ఎంటర్‌..ఎవరో తెలుసా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. అయితే ఇందులో నిత్యవసర వస్తువులను ఇబ్బందులు తలెత్తుకుండా.. ప్రభుత్వం ఎమర్జెన్సీ సర్వీసులకు ఈ లాక్‌డౌన్‌లో మినహాయింపు ఇచ్చింది. అయితే ఇదే అదనుగా పలుచోట్ల వ్యాపారస్తులు.. సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇక రైతు బజార్లలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరలకు మార్కెట్ వ్యాపారులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:50 pm, Tue, 31 March 20
సంచి పట్టి.. పంచె కట్టి.. రైతు బజార్‌లోకి ఎంటర్‌..ఎవరో తెలుసా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. అయితే ఇందులో నిత్యవసర వస్తువులను ఇబ్బందులు తలెత్తుకుండా.. ప్రభుత్వం ఎమర్జెన్సీ సర్వీసులకు ఈ లాక్‌డౌన్‌లో మినహాయింపు ఇచ్చింది. అయితే ఇదే అదనుగా పలుచోట్ల వ్యాపారస్తులు.. సామాన్య ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇక రైతు బజార్లలో కూరగాయల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరలకు మార్కెట్ వ్యాపారులు అమ్ముతున్నారా..?లేక అధిక ధరలకు విక్రయిస్తున్నారా అన్న దానిపై ఎంక్వైరీ చేసేందుకు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ రంగంలోకి దిగారు.

లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో మార్కెట్‌లో కూరగాయలు.. నిత్యావసర వస్తువుల ధరలను కొందరు వ్యాపారస్థులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కిశోర్‌ మారువేషంలో రంగంలోకి దిగారు. ఇందులో నిజమెంతో తెలుసుకునేందుకు రాజీవ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌కు వెళ్లారు.. వినియోగదారుడిలా కూరగాయలు, నిత్యావసర వస్తువులను బేరమాడుతూ కొనుకున్నారు. దాదాపు మార్కెట్‌లోని అన్ని షాపుల దగ్గరకు వెళ్లి.. ధరల్ని అడిగి తెలుసుకున్నారు. ఇలా సడన్‌గా సామాన్యుడిలా మార్కెట్‌లో ఎంటర్‌ అయ్యింది జిల్లా జాయింట్ కలెక్టర్‌ అని తెలుసుకుని షాక్ తిన్నారు. అయితే షాపింగ్‌ ముగిసిన తర్వాత.. మార్కెట్‌లో ధరలు దాదాపు నియంత్రణలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇక ఉల్లి, టమాట మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు.