AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#Tablighi Jamaith తబ్లిఘీ జమాత్‌పై రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం కీలక ఆదేశాలు

కరోనా తగ్గిపోతుందనుకుంటున్న సమయంలో పేలిన తబ్లిఘీ జమాత్ సదస్సు లింక్డ్ కరోనా కేసులు దేశ ప్రజలందరినీ కలవరపాటుకు గురిచేసింది. టూరిస్టు వీసాలపై వచ్చి.. ఇక్కడ మత సంబంధమైన కార్యకలాపాలలో ఎలా పాల్గొన్నారన్న సందేహాలు ఒకవైపు వినిపిస్తుండగా..

#Tablighi Jamaith తబ్లిఘీ జమాత్‌పై రాష్ట్రాల డీజీపీలకు కేంద్రం కీలక ఆదేశాలు
Rajesh Sharma
|

Updated on: Mar 31, 2020 | 7:18 PM

Share

Union home ministry warned state police heads: కరోనా తగ్గిపోతుందనుకుంటున్న సమయంలో పేలిన తబ్లిఘీ జమాత్ సదస్సు లింక్డ్ కరోనా కేసులు దేశ ప్రజలందరినీ కలవరపాటుకు గురిచేసింది. టూరిస్టు వీసాలపై వచ్చి.. ఇక్కడ మత సంబంధమైన కార్యకలాపాలలో ఎలా పాల్గొన్నారన్న సందేహాలు ఒకవైపు వినిపిస్తుండగా.. మరోవైపు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు కేంద్రం సిద్దమైంది. అదే సమయంలో వారి ద్వారా దేశంలో పలువురికి కరోనా వైరస్ సోకే ప్రమాదం వుండడంతో తగిన విధంగా చర్యలకు శ్రీకారం చుట్టింది కేంద్ర హోంశాఖ. ఈ మేరకు పలు రాష్ట్రాల డీజీపీలకు కీలకమైన సమాచారాన్ని పంపింది కేంద్ర హోంశాఖ.

మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ వాటిని రాష్ట్రాల డీజీపీలతో పంచుకుంది. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు, విదేశాల విజిటింగ్ వీసాలపై వచ్చిన పలువురు పెద్ద సంఖ్యలో తబ్లీఘీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తించింది హోంశాఖ. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్ భవనంలో రిపోర్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారు.. వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కో-ఆర్డినేటర్ల ద్వారా చిల్లా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మార్చి 21వ తేదీ నాటికి మర్కజ్ భవనంలో 1746 మంది ఉన్నారు. వారిలో 1530 దేశీయలు కాగా.. 216 మంది విదేశీయలున్నారు. అప్పటికే దేశవ్యాప్తంగా 824 మంది విదేశీయలు ఈ చిల్లా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని హోం శాఖ గుర్తించింది. భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని, వారికి సంబంధించిన వివరాలను డీజీపీలతో షేర్ చేసుకుంది కేంద్ర హోం శాఖ.

ఇప్పటి వరకు 824 మంది విదేశీయులను స్క్రీనింగ్ చేసి క్వారంటైన్ కు పంపాలని రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు, జిల్లా కోర్డినేటర్లకు కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని పోలీసులను ఆదేశించామని వివరించారు. ఇప్పటి వరకు 2137 మంది భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలను పరీక్షించి అవసరమైన మేరకు క్వారంటైన్‌కు తరలించామని తెలిపారు.

దీంతో పాటు తబ్లీక్ జమాత్ కార్యకర్తలు తిరిగిన ప్రాంతాలు, ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల వివరాలు సేకరించాలని రాష్ట్రాల డీజీపీలకు ఇంటెలిజెన్స్ బ్యూరో సూచించింది. ఆమేరకు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి తబ్లీఘి జమాత్ కార్యకర్తలు అందరిని స్క్రీనింగ్ చేస్తున్నామని 1203 మంది స్క్రీనింగ్ చేయగా 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని, వారిని దిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించామని హోం శాఖ వర్గాలు తెలిపాయి. మిగతావారిని నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పూరిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని అంటున్నాయి.

జనవరి 1 నుంచి 2100 మంది విదేశీయులు తబ్లీఘీ జమాత్ కార్యక్రమాల కోసం భారత్ వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఆయా రాష్ట్రాలకు విదేశీయుల రాకపై వివరాలను అందిస్తోందని, వారిని ట్రేస్ చేసే పనిని రాష్ట్రాల డీజీపీలకు అప్పగించామని హోం శాఖ అధికారులు తెలిపారు.